Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ సాయం చేయడం నేనెప్పుడూ చూడలేదు – యాంకర్ శ్యామల

Shyamala Pawan Comments

Shyamala Pawan Comments

యాంకర్ శ్యామల తీరు ఇక మారడం లేదు..ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫై పలు వ్యాఖ్యలు చేసి అభిమానుల చేత చివాట్లు తిన్నప్పటికీ..ఆమె ప్రవర్తన మాత్రం మారలేదు. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. “ఒక్కటే మాట చెబుతా… రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు. రాజకీయాలు అంటే సాయం చేయడం అని నేను నమ్ముతా. రాజకీయాలకు నేనిచ్చే నిర్వచనం ఇదీ!

ఇప్పటివరకు ఆయన ఆవేశపడడం చూశాను, ఆయాసపడడం చూశాను. పాపం… వేదికలపై ఎంత అరుస్తారండీ ఆయన! ఆయనను ఈ విధంగా చూశానే తప్ప… సాయం చేయడం ఎక్కడా చూడలేదు” అంటూ శ్యామల పేర్కొనడం ఫై అభిమానులు, జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు. శ్యామల కొన్ని గంటలు వెయిట్ చెయ్యి..ఏమవుతుందో అంటూ రిప్లయ్ ఇస్తున్నారు.

రాజకీయాల (Politics) జోలికి వెళ్లకూడదని..రాజకీయాలు అనేది పెద్ద రొచ్చు అని చాలామంది అభిప్రాయపడుంటారు. ఎన్నికల సమయంలో తమకు నచ్చిన లీడర్ కు ఓటు వేశామా..తిరిగి మన పని మనం చేసుకున్నామా..అని అంత మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది కావాలని రాజకీయాల జోలికి వెళ్లి అందరి చేత చివాట్లు తింటూ..కెరియర్ నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా చిత్రసీమ(Film Industry)లో చాలామంది అందుకే రాజకీయాల జోలికి వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. ఎవరికీ మద్దతు తెలిపితే..ఎవరు ఎలా స్పందిస్తారో..తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలామంది భయపడుతుంటారు. తమకు లోలోపల పాలనా అభ్యర్ధికి మద్దతు తెలుపాలని , ప్రచారం చేయాలనీ ఉన్నప్పటికీ..అవతల పార్టీల వ్యక్తులను చూసి కాస్త వెనుకడుగు వేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి ఏపీ ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. కొంతమంది నేరుగా కొంతమంది సినీ స్టార్స్ పవన్ కళ్యాణ్ , కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వగా..వైసీపీ కి పెద్దగా ఎవ్వరు మద్దతు తెలుపలేదు. కానీ యాంకర్ శ్యామల మాత్రం వైసీపీ కి మద్దతు తెలుపడం..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు చిత్రసీమలో కూడా హాట్ టాపిక్ గా మారింది. చిత్రసీమకు ఏ మంచి చేసాడని జగన్ కు సపోర్ట్ ఇస్తున్నారని శ్యామల ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయం చేయడం చూడలేదని పేర్కొనడం ఫై విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో గెలవకపోయిన..ఏ పదవి లేకపోయినా తాను కష్టపడినా డబ్బు తో కౌలు రైతు కుటుంబాలను ఆదుకున్న విషయం తెలియదా..? చిత్రసీమలో ఎంతమందిని ఆదుకున్నాడో తెలియదా..? తుఫాన్ బాధితులకు , భూకంప బాధితులకు సాయం చేయడం తెలియదా..? అని ప్రశ్నిస్తూ శ్యామల ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. రేపు పవన్ గెలుపు తర్వాత శ్యామల ఫై ఇంకా ఏ రేంజ్ లో ఆడేసుకుంటారో చూడాలి.

Read Also : AP Election Results : ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ..