Site icon HashtagU Telugu

Nara Lokesh: పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు చరమగీతం పాడాలి : నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని మండిపడ్డారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరమణారెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. టిడిపికి మద్దతు ఇస్తున్నారని కారణంతో ఊర్లకు ఊర్లు తగలబెడుతూ, కుటుంబాలను మట్టు పెడుతోన్న పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు చరమగీతం పాడాలని లోకేశ్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన వీడియో – వైరల్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం (ఈసీ) ఈసారి మాచర్లను సున్నితమైన ప్రాంతంగా ప్రకటించింది. పోలింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.