Ananthapuram : ఏపీ పోలీస్ `జంబ‌ల‌క‌డిపంబ`, ఎస్పీపై అట్రాసిటీ కేసు

ఏపీ పోలీస్ వ్య‌వ‌హారం ప‌రాక‌ష్ట‌కు చేరింది. సాక్షాత్తు అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేయ‌డం సంచ‌ట‌నంగా మారింది.

  • Written By:
  • Updated On - September 1, 2022 / 02:22 PM IST

ఏపీ పోలీస్ వ్య‌వ‌హారం ప‌రాక‌ష్ట‌కు చేరింది. సాక్షాత్తు అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేయ‌డం సంచ‌ట‌నంగా మారింది. అనూహ్యంగా ఎస్పీ మీద అట్రాసిటీ కేసు న‌మోదు కావ‌డం ఏపీ పోలీసుశాఖ‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌కాశ్ కేసు మ‌లుపులు తిరుగుతూ ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌పై అట్రాసిటీ కేసు పెట్టే వ‌ర‌కు చేరింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రకాశ్ ను విధుల నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప రెండు వారాల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పర్యటన కు వ‌చ్చినప్పుడు ప్రకాశ్ నిరసన వ్యక్తం చేశాడు. `సేవ్ ఏపీ పోలీస్ `అంటూ ప్లకార్డు ప్ర‌ద‌ర్శించారు. దీంతో జ‌గ‌న్ ఆగ్ర‌హించారు. వెంట‌నే ప్ర‌కాశ్ పై ఉన్న ఆరోపణలను తెర‌పైకి తెచ్చారు. విచారణ జరిపి ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు.

కక్ష సాధింపుల్లో భాగంగానే తనను డిస్మిస్ చేశారంటూ ప్రకాశ్ ఆరోపించాడు. అంతేకాదు, ఎస్పీ ఫకీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తును డీఐజీ రవి ప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు.