తెనాలి ఘటన నేపథ్యంలో సీఎం జగన్ (Jagan) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ చంద్రబాబుపై “కేసులుంటే కొడతారా?” అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చంద్రబాబుపై నమోదైన 24 కేసుల్లో 22 కేసులు జగన్ ప్రభుత్వం కుట్రగా వేసినవేనని ఆనం ఆరోపించారు. ఉచిత ఇసుక పంపిణీ, పుంగనూరులో దాడి, లౌడ్ స్పీకర్లు వినిపించారంటూ పెట్టిన కేసులు ఏవీ న్యాయబద్ధమైనవేమీ కావని, వాటి ఉద్దేశ్యం ఆయనను నెగెటివ్‌గా చూపడం మాత్రమేనన్నారు.
Weather Updates: మారిన వాతావరణం.. మూడు రోజులు భారీ వర్షాలు..
తెనాలి ఘటనలో ముగ్గురు రౌడీషీటర్లను చంద్రబాబుతో పోల్చడాన్ని ఆనం తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ పరామర్శించిన ఆ వ్యక్తుల్లో ఒకరు గంజాయి కేసులో, మరొకరు అత్యాచారయత్నంలో, ఇంకొకరు ఆటో దొంగతనంలో పాలుపంచుకున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వారి కోసం సీఎం స్వయంగా వెళ్లడం దురదృష్టకరమన్నారు. జగన్ చంద్రబాబుపై విచిత్రమైన కేసులు పెట్టి, వారిని ఈ స్థాయికి తీసుకువచ్చారని, ఇక జగన్‌పై ఉన్న 31 కేసుల్లో 11 సీబీఐ, 7 ఈడీ కేసులన్న విషయాన్ని గుర్తుచేశారు.
జగన్ ఇప్పటివరకు 3452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకున్నారని, దీనికోసం హరీష్ సాల్వే, అభిషేక్ మనుసింఘ్వి, ముకుల్ రోహత్గీ వంటి ఖరీదైన లాయర్లను నియమించారని ఆనం విమర్శించారు. వీరికి గంటకు రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, దాదాపు రూ. 6904 కోట్లు లీగల్ ఫీజులకు ఖర్చుపడ్డాయని అంచనా వేయడం భయంకరమన్నారు. ఒక్క కేసు విచారణ కూడా జరగకపోవడాన్ని, మళ్లీ మళ్లీ వాయిదాలు తీసుకోవడాన్ని చూసి ప్రజలు నిజమెరిగే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.