AP Ration : ఏపీ రేష‌న్ దుబారా ప‌క్కాగా.!

పాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఏపీ సీఎం జ‌గ‌న్ పెట్టిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా రేష‌న్ పంపిణీ కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన సామెత‌గా ఉంది.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 12:49 PM IST

పాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఏపీ సీఎం జ‌గ‌న్ పెట్టిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా రేష‌న్ పంపిణీ కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన సామెత‌గా ఉంది. వివిధ మార్గాల ద్వారా ఆర్థిక భారాన్ని త‌గ్గించుకోవాల్సిన ఏపీ స‌ర్కార్ కేవ‌లం రేష‌న్ పంపిణీ వ్య‌వ‌స్థ‌లో తెచ్చిన మార్పులు కొన్ని కోట్ల రూపాయల దుబారాను పెంచింది. వాటి లెక్క‌లు ప‌క్కాగా వేస్తే సుమారు 3వేల కోట్ల‌కు పైగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్ట‌పోయిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ అనాలోచిత నిర్ణ‌యం కార‌ణంగా దుబారా లెక్క పక్కాగా ఇలా ఉంది.

వాలంట్రీస్ జీత భత్యాలు:
మొత్తం వాలంట్రీస్: 192964
నెల జీతం మొత్తం : 5000
మొత్తం : 192964 X 5000= 964820000

రేషన్ ఆటోల ఖర్చు:
Ration ఆటల కొనుగోలుకు అయిన ఖర్చు 900 కోట్లు
మొత్తం రేషన్ ఆటోలు: 9260
ఆటోకి నెలకు అన్ని కలిపి ఇచ్చేది : 16000
నెలకు: 9260X16000 = 14816000

అంటే పక్క రాష్ట్రల్లో అవేవి లేవు
ఇవి AP లో లేకుండా ఉంటే నెలకు మిగిలే ఖర్చు :
964820000 + 1481600 = 1112980000

అంటే రఫ్ గా 2 1/2 ఇయర్స్ వేసుకుందాం అంటే 30 నెలలు అనుకుందామ్
1112980000X30 = 33389400000
ఇంత డబ్బు తగలేసే బదులు లబ్ది దారుడికి రేషన్, నిత్య అవసరాల కోసం నెలకు 3500 నగదు బదిలినే చెయ్యచ్చు. ఇచ్చే నాశి రకం బియ్యం కి ఇంత అతి చెయ్యడం అవసరమా ? పైగా ఈ మధ్యే వాలంట్రీస్ కి బహుమతుల పేరుతో మరో 258.74 కోట్లు అదనపు భారం ప‌డింది. జగన్ ప్రభుత్వం చేసిన blunder mistake అర్ధమైన త‌రువాత‌ రేషన్ రద్దు చేసి 5 కేజీల బియ్యం కు గాను ఒక్కో కేజీ కి 20-30 రూపాయలు ఇచ్చే విదంగా ఆలోచన చేసింది. ఇన్ని రోజులు రేషన్ ఆటోల ఖర్చుకు తగలేసిన వాటి పై విమర్శలు రావడంతో ఆలోచన మార్చుకుంది. అనవసర దుబారా ఖర్చు చేయటానికి, అప్పుతెచ్చి మరీ తగలేస్తున్నారు. ఇలాంటి దుబారాను త‌గ్గించుకోగ‌లిగితే కొంత మేర‌కు అయినా ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.