Site icon HashtagU Telugu

Anakapalli : అనకాపల్లి బెల్లం ఇక ఆన్ లైన్ లో!

Anakapally Jaggery

Anakapally Jaggery

బెల్లమంటే అనకాపల్లిదేనబ్బా! ఒక్క ముక్క అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. తీయని రుచితో, మంచి సువాసనతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏదైనా స్వీట్ చేసినప్పుడు అందులో అనకాపల్లి బెల్లం కాని, అక్కడి బెల్లం పొడి కాని వాడితే… తిరుగులేదంతే. దాని టేస్ట్ అట్లుంటాది. కానీ ఆ అదృష్టం అనకాపల్లి వాసులతోపాటు చుట్టుపక్కల వారికే ఇన్నాళ్లు పరిమితమైంది. దూరప్రాంతాల్లో ఉన్నవారు అనకాపల్లి బెల్లాన్ని కొనాలనుకున్నా వారికి సమీపంలో దొరికేది కాదు. కానీ ఇప్పుడంతా ఆన్ లైనే కదా. అందుకే అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఓ అడుగు ముందుకేసింది.

ఈ పరిశోధనా కేంద్రం తాము తయారుచేసే బెల్లం ముక్కలు, బెల్లంపొడిని ఆన్ లైన్ అమ్మడానికి వీలుగా అమెజాన్ తో ఒప్పందం చేసుకుంది. పైగా ఇక్కడ బెల్లం తయారీకి ఎలాంటి కెమికల్స్ నూ పయోగించరు. అందుకే వీటికి లోకల్ గా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కేజీ బెల్లం ధర రూ.90, 500 గ్రాముల బెల్లం పొడి రేటు రూ.90

బెల్లంతోపాటు ఈ పరిశోధనా కేంద్రంలో జీవన ఎరువులూ తయారవుతాయి. కాకపోతే వీటిని కావాలనుకునేవారు.. అక్కడికే వెళ్లి కొనాల్సి వచ్చేది. దీంతో నిర్వాహకులు.. ఈ ఎరువులను కూడా ఆన్ లైన్ లో అమ్మడానికి అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా సులభంగా వీటిని కొనడానికి అవకాశం ఉంటుంది. జీవన ఎరువులు అంటే నత్రజని, పొటాష్, భాస్వరం.. వీటిని మొక్కలకు వేస్తే.. అది ఎరువుల ఉపయోగాన్ని దాదాపు 25 శాతం తగ్గిస్తుంది. అందుకే లిక్విడ్ ఎరువును లీటరు రూ.170 కు అమ్ముతున్నారు. త్వరలో ఫ్లిప్ కార్ట్ లోనూ వీటి అమ్మకాలు ఉంటాయి.

Exit mobile version