Site icon HashtagU Telugu

Anakapalle : కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి

Akp Food

Akp Food

పండగవేళ అనకాపల్లి (Anakapalle ) జిల్లాలో విషాదం నెలకొంది. కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించడం ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో (Anakapalle Orphanage Home Incident) కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే విద్యార్థులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థులు ఈరోజు చనిపోయారు. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది చెబుతోంది. మృతులను జాషువా, భవాని, శ్రద్ధ గా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీఈవో తెలిపారు. మరోవైపు కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు చనిపోవటం స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉందో లేదో చూసుకోకుండానే అందిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా కారణంగానే విద్యార్థుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యార్థుల మరణ వార్త విన్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు మృతిపై విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

Read Also : CM Siddaramaiah : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..ఎలాంటి తప్పు చేయలేదు: సీఎం సిద్ధరామయ్య

Exit mobile version