Jagan April ‘Mood’: అమ్మో జగన్, ఏప్రిల్ ‘మూడ్’ దడ

వైసీపీ ఎమ్మెల్యే లలో దడ మొదలైంది. 24 గంటల్లో ఏదో జరగబోతుందని టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఊపిరి బిగపట్టి గంటలు లెక్కిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 10:31 AM IST

Jagan’s April ‘Mood’ : వైసీపీ ఎమ్మెల్యే లలో దడ మొదలైంది. 24 గంటల్లో ఏదో జరగబోతుందని టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఊపిరి బిగపట్టి గంటలు లెక్కిస్తున్నారు. కారణం ఏప్రిల్ 3న జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని బిక్కమొహాలతో చాలా మంది ఉన్నారట. సాధారణంగా అయితే అంత టెన్షన్ ఉండేది కాదు, దెబ్బతిన్న పులిలా ఇప్పుడు జగన్ (Jagan) ఉన్నదని తాడేపల్లి టాక్. రెబెల్ ఎమ్మెల్యే లు నలుగురు గట్టు తప్పడం, పట్టభద్రుల ఎన్నికల్లో పరాజయం, ఢిల్లీ చక్కర్లు వెరసి జగన్ లోలోన రగిలిపోతున్నారని తెలుస్తుంది. ఇలాంటి పరిస్తుతుల్లో పెడుతున్న అత్యంత ప్రాధాన్యం ఉన్న మీటింగ్. దీనిలో ఎందరిని సిట్టింగ్ లను లేపేస్తారు? మంత్రులకు షాక్ ఎలా ఉంటుంది? అసెంబ్లీ రద్దు? ఇలాంటి థాట్స్ ఫాన్ పార్టీని వేధిస్తోంది. ఎన్టీఆర్ తరువాత బోల్డ్ నిర్ణయాలు తీసుకునే సీఎం జగన్ మాత్రమే కనిపిస్తున్నారు.

ఒకే రోజు 30 మంది మంత్రులపై వేటు వేసిన ఎన్టీఆర్ తరహా గట్స్ ఉన్న సీఎం గా జగన్ ఉన్నారు. ఆ కోణంలో నుంచి చూస్తే కనీసం 10 మంది మంత్రులు ఔట్ అంటూ తాడేపల్లి లీక్స్ ఉన్నాయి. ఇక సిట్టింగ్ లను 50 మందిని ఉంటే ఉండండి లేదంటే టికెట్స్ ఆశించవద్దు అని మొఖం మీద చెప్పడానికి సిద్ధం అయ్యారని తెలుస్తుంది. అందుకే వైసీపీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కొందరు ముందే డుమ్మా కొట్టడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జగన్ నిర్ణయాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ప్రజా వేదిక ను తొలి రోజుల్లోనే కూల్చివేయటం. అందుకే అసాధారణ నిర్ణయాలు ఉంటాయని దడిసి పోతున్నారు.

సాధారణంగా చంద్రబాబు వద్ద ప్లాన్ ఏ మాత్రమే ఉండదు ప్లాన్ బీ ప్లాన్ సీ ప్లాన్ డీ వంటివి కూడా చాలా ఉంటాయి. జగన్ (Jagan) విషయం చూస్తే ముక్కుసూటిగా దూకుడుగా ముందుకు పోవడమే నైజం. అందుకు ఎదురయ్యే భారీ నష్టాలను కూడా ఫేస్ చేసేందుకు ఆయన సిద్ధపడతారు. అయితే చిక్కు అల్లా ఆయనతో ఉన్న వారిదే. వారు ఫక్తు ట్రెడిషనల్ పాలిటిక్స్ కి అలవాటు మాత్రమే ఉంది. అందుకే వైసీపీలో ఎపుడూ అధినాయకత్వానికి లీడర్స్ కి మధ్య గ్యాప్ ఉంది. జమ్ తేలినా మునిగినా జగంతోనే అనుకున్న వారు మాత్రం ఆయనను అనుసరిస్తారు. వాళ్లలో సీనియర్లు ఎవరైనా ఉంటే మాత్రం బయటకు ఏదో నాటికి వెళ్ళిపోతారు.

ఏప్రిల్ 3న జగన్ ఏం చేయబోతున్నారు అన్నది ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోంది. ఒక విధంగా హై బీపీని తెప్పిసోంది. జగన్ చెప్పేది షాకింగ్ న్యూసేనా లేక షరా మామూలుగా పనితీరు మీద హెచ్చరించి వదిలేస్తారా అన్నదే చర్చగా ఉంది. వైసీపీకి ఏప్రిల్ మూడు బిగ్ డేగా ఉండబోతోంది. ఇటీవల జరిగిన అనేక రాజకీయ పరిణామాలు జగన్ ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు వరసబెట్టి ఢిల్లీకి వెళ్ళి రావడాలు ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటములు,నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్లు ఇవన్నీ చూసిన వారికి మాత్రం ఏదో ఉపద్రవమే రాబోతోందని ఊహిస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో విపక్షాలకు స్వపక్షానికి షాక్ ఇచ్చేలాగానే జగన్ డెసిషన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. అది అసెంబ్లీ రద్దు, ముందస్తు వంటి అనూహ్యమైన నిర్ణయాలుగా మారతాయా అన్నదే చర్చగా ఉందిట. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నలుగురు ఎమ్మెల్యేలు జగన్ని ధిక్కరించి బయటకు వెళ్ళదాన్ని ఏ కోశానా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

అదే విధంగా మరింత మంది లోలోపలా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మరి వారి మాటేంటి అన్నది కూడా వైసీపీ హై కమాండ్ ని కలవరపెడుతోంది. ఇలా పుండు మీద కెలికి ఎంతకాలం పొడిపించుకోవడం అన్నదే హై కమాండ్ ఆలోచనట. మామూలుగా మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి లేకపోయినా లేక నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరగకపోయినా బిగ్ డేకు అవకాశం ఉండేది కాదు. కానీ సీన్ మొత్తం ఇపుడు మారుతోంది కాబట్టే ఇంతలా చర్చకు వస్తోంది.

ఏది ఏమైనా జగన్ ఈ నెల 3న పెట్టే మీటింగ్ ఏపీ రాజకీయాలు కాదు జాతీయ స్థాయిలోనూ సెన్షేషనల్ న్యూస్ బ్యానర్ న్యూస్ ఇచ్చేలాగానే కీలక మైన డెసిషన్ వైపుగా కదిలే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం అవుతుంది. ఇక ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే అంతా ఊహిస్తున్నట్లుగా డిసెంబర్ లో ఏపీ ఎన్నికలు తెలంగాణాతో పాటే జరగవు. దాని కంటే ముందు జూన్ లేదా జూలైలో పెట్టించుకోవడానికే వైసీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. ఆ మాటకే కేంద్ర నాయకత్వం నుంచి అనుకూల స్పందన వచ్చేలా చేసుకుందని టాక్. అలా అయితేనే ఏపీలో విపక్షాలకు గట్టి దెబ్బ పడుతుందని ఎవరికి ఎవరూ కాకుండా లేకుండా అయోమయంగా పోటీ చేస్తేనే వైసీపీ పంట పండుతుంది అని ఆలోచిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలీ అంటే కళ్ళు మూసి జెల్ల కొట్టినట్లుగా ఇలా అసెంబ్లీ రద్దు అలా జస్ట్ రెండు నెలల తేడాతో ఎన్నికలు జరిపించేసుకోవడమే అన్నట్లుగా వైసీపీ ఆత్రపడుతోందని వినికిడి. ఒక వేళ అదే జరిగితే మాత్రం జగన్ డబుల్ సక్సెస్ అని కూడా అనాల్సిందే. ఇన్ని కోణాల నడుమ ఏప్రిల్ 3 వైసీపీకి బిగ్ డే గా మారింది. ఎమ్మెల్యే లు, మంత్రులకు టెన్షన్ డే గా మారింది.

Also Read:  AP Politics: ముందస్తుకు మేం రెడీ.. జగన్ కు బాబు సవాల్!