Amma Vodi : ఈ నెల 27న తల్లుల అకౌంట్లోకి నిధులు.. రూ. 13వేలు జమ. !!

ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్.

  • Written By:
  • Updated On - June 22, 2022 / 07:20 PM IST

ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నిధుల విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈనెల 27న విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఈ పథకం నిధులు జమ చేయనుంది సర్కార్. అమ్మఒడి పథకం కింద ఒక్కో స్టూడెంట్ కు ఏడాదికి రూ. 15వేల రూపాలయను అందిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది మాత్రం రూ. 13వేలు మాత్రమే జమ చేయనుంది. దీనికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. అమ్మ ఒడి పథకం కోసం ఈ ఏడాది రూ. 6,500కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది ప్రభుత్వం.

ఇక పోయిన ఏడాది ఈ పథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది లక్షకు పైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది సర్కార్. పాఠశాలలకు గైర్హజరు కారణంతో 51వేల మంది విద్యార్థులను అనర్హులుగా తేల్చారు అధికారులు. ఇక మిగతా 50వేల మంది విద్యార్థులను ఇతరాత్ర కారణాలతో జాబితా నుంచి తొలగించారు.