Site icon HashtagU Telugu

Tirupati Meet: తిరుపతిలో కీలక సమావేశం అధ్యక్షుడిగా అమిత్ షా, ఉపాధ్యక్షుడిగా జగన్

దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం ఈసారి ఏపీలోని తిరుపతిలో ఈనెల 14న మొదలు కానుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉపాధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సీఎం జగన్ వ్యవహరిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా ఇలాంటి సమావేశం రెండుసార్లు జరిగింది. వాటికి కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి కేసీఆర్ హాజరై కేంద్రంతో రాష్ట్రానికున్న ఇబ్బందులను చర్చించే అవకాశముంది.

తెలంగాణాలో పండించే వరిధాన్యం విషయం, పెట్రోల్ డీజిల్ పై సెస్ తగ్గింపు, నవోదయ విద్యాలయాలు, గిరిజన యూనివర్సిటీలతో పాటు విభజన హామీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశముంది.

ఏపీ ప్రభుత్వం సైతం పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ తో పాటు నదీజలాలు, స్పెషల్ స్టేటస్, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై చర్చించే అవకాశముంది.

 

ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ సమావేశంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చూపిస్తున్న వివక్ష అంశమే ప్రధానంగా ఉండవచ్చు. వాటితో పాటు జాతీయ భద్రత, మావోయిజం నిర్ములన అంశాలపై కేంద్రం సౌత్ సీఎంలకు సూచనలిచ్చే అవకాశముంది.

 

Exit mobile version