Site icon HashtagU Telugu

Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..

Amith Sha Bng

Amith Sha Bng

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు రాజకీయ నేతలు సైతం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. జూన్ 04 న ఈ ఫలితాలు వెల్లడి కాబోతుండడం తో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈసారి కూటమి గెలుస్తుందా..? వైసీపీ గెలుస్తుందా..? అంటూ పెద్ద ఎత్తున లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఏపీలో పర్యటించడం ఆసక్తి నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు. రాత్రికి తిరుమల చేరుకుని వకుళామాత అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, మ. 12 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పర్యటనలో ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్ తో భేటీ ఉంటుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Read Also : KCR Mark : కేసీఆర్ మార్క్‌ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం