Site icon HashtagU Telugu

Amith Sha : రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం – అమిత్ షా

Amith Sha Hindhupuram

Amith Sha Hindhupuram

ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా నేడు హిందూపురం (Hindhupuram) లోక్ సభ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాసేపటి క్రితం ధర్మవరం (Dharmavaram) చేరుకున్నారు. ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు (Chandrababu ), అమిత్ షా (Amith Sha) కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు సత్కరించారు. ధర్మవరం నుంచి కూటమి తరఫున సత్యకుమార్ పోటీలో ఉన్నారు.

ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘రాముడు, జఠాయువు కలిసిన పుణ్యభూమి లేపాక్షికి ప్రణామం చేస్తున్నా. లోక్ సభ రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో మోడీ సెంచరీ కొట్టడం ఖాయం. తర్వాతి దశల్లో మొత్తం 400కు పైగా సీట్లు సాదించబోతున్నాం అని అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. ఇక ‘పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం’ అని అమిత్ షా హామీ హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘ఏపీలో గూండాగిరి అంతానికి, అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, భూమాఫియాను అంతం చేయడానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే బిజెపి , టీడీపీ , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డామని , తిరుమలలో శ్రీవారి పవిత్రతను కాపాడుతాం. తెలుగు భాషను రక్షించడానికి మేమంతా కూటమిగా ఏర్పడ్డాం అని తెలిపారు. జగన్ గుర్తించుకో.. బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వం’ అని తేల్చి చెప్పారు.

ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ తనకు మంచి మిత్రుడని అని అమిత్ షా తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని, మోడీ ని మరోసారి ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ కమలం వికసించనుందని అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి అభ్యర్థులందరినీ మంచి మెజార్టీతో గెలిపించాలని అమిత్ కోరారు. ‘చంద్రబాబు, మోదీని మళ్లీ గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలి. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలి’ అని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ఏపీని ప్రగతి పథంలో నిలిపితే.. జగన్ భ్రష్టుపట్టించారని అమిత్ ఆరోపించారు. ‘ఉమ్మడి ఏపీని చంద్రబాబు నం.1లో నిలిపారు. విభజిత ఏపీని కూడా ప్రగతి పథంలో నిలిపారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారు. మద్య నిషేధం చేస్తానని జగన్ మాట తప్పారు. మద్యం సిండికేట్కు తెరలేపారు. అట్టహాసంగా ఆరోగ్యశ్రీ ప్రకటించి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు’ అని అమిత్ షా నిప్పులు చెరిగారు.

Read Also : Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?