Amaravathi : అమ‌రావ‌తిపై `షా` మార్క్

రాజ‌కీయంగా ఏపీ బీజేపీ అమరావ‌తి ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - November 22, 2021 / 05:22 PM IST

రాజ‌కీయంగా ఏపీ బీజేపీ అమరావ‌తి ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్ర‌జ‌లు కూడా అదే అనుకుంటున్నారు. ఇంత కాలం ఏ మాత్రం పున‌రాలోచ‌న చేయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంది. షా ఆదేశాల మేర‌కు జ‌గ‌న్ ఆ విధంగా నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అంటున్నాడు.
రాజ‌ధాని విష‌యంలో బీజేపీ, వైసీపీని వేర్వేరుగా చూడ‌లేం. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ కేంద్రానికి తెలిసే చేస్తాడ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. రాజ‌కీయంగా కూడా అవ‌గాహ‌న‌తో టీఆర్ఎస్‌, బీజేపీ, వైసీపీ ముందుకు న‌డుస్తున్నాయ‌ని చెప్ప‌డానికి అనేక అంశాలు ఉన్నాయి. పార్ల‌మెంట్ వేదిక‌గా ఎన్డీయే ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌ను అనేక సంద‌ర్భాల్లో టీఆర్ఎస్, వైసీసీ మ‌ద్ధ‌తు ఇచ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో ఆ రెండు పార్టీలు ఎన్డీయేలో భాగ‌స్వామ్యం అవుతాయ‌ని కూడా చ‌ర్చ జ‌రిగింది.మ‌హాపాదయాత్ర చేయాల‌ని అమిత్ షా బీజేపీ నేత‌ల‌కు ఆదేశం జారీ చేశాడు. వాళ్లు రంగంలోకి దిగిన 24 గంట‌ల్లోనే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కు తీసుకున్నాడు. అంటే, జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకోబోయే నిర్ణ‌యం ముందే బీజేపీకి తెలుసు. అమిత్ షా కు ఖ‌చ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే, ఈనెల 21న మ‌హాపాద‌యాత్ర‌కు బీజేపీ కీల‌క నేత‌లు వెళ్లారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. అంతేకాదు, ఏపీకి ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకునే అంశాన్ని కూడా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ప‌రిశీలించి ఉంటారు. అక్క‌డ నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు మాత్ర‌మే జ‌గ‌న్ కొత్త బిల్లు రూపుదిద్దుకుంది. ఆ విష‌యంలో ఎలాంటి సందేహం అవ‌స‌రంలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. వైసీపీ, బీజేపీ క‌లిసి అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని కొత్త రూపంలోకి తీసుకెళ్లారన్న‌మాట‌.