Site icon HashtagU Telugu

Pawan Kalyan : కేంద్ర పెద్దల వద్ద పవన్ స్థానం ఇది..!

Amithsha Pawan

Amithsha Pawan

ఏపీలో ఈరోజు కూటమి అనేది ఏర్పడడానికి, అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఇది అవునన్నా..కాదన్నా అక్షర సత్యం. ఆనాడు చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే..ఆయనకు నేనున్నా అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు రావడం , సపోర్ట్ ఇవ్వడం, బిజెపి , టిడిపి , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడడం ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం , బిజెపి కోసం పవన్ తన స్థానాలు తగ్గించుకోవడం ఇలా ఎన్నో త్యాగాలు చేసాడు. ఇవన్నీ కేంద్ర పెద్దలు మరచిపోరు. ఈరోజు ఏపీలో కూటమి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం. అందుకే పవన్ విషయంలో కేంద్రం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది.

World Championship Title: ఖో ఖో ప్రపంచ కప్ 2025.. ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ జ‌ట్టు!

గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ ను కొంతమంది టార్గెట్ చేయడం…లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనీ డిమాండ్ తెరమీదకు రావడం తో అంత రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పవన్ స్థాయి తగ్గిందని , కేంద్రం వద్ద కూడా పవన్ కళ్యాణ్ హావ ఏమి లేదంటూ ఇలా ఎవరికీ వారు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వాటి అన్నింటికీ ఈరోజు అమిత్ షా (Amith Sha) ఫుల్ స్టాప్ పడేలా చేసారు.

విజయవాడ కొండపావులూరులో జరిగిన NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవంలో హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రొటోకాల్ ప్రకారం కుర్చీలు వేశారు. అయితే ఈ విషయం గమనించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే ఆయన మరొక కుర్చీ తెచ్చి, పవన్ కళ్యాణ్‌కి కూడా కూర్చోవాలని సూచించారు. ఇది అక్కడివారిని షాక్ కు గురి చేసింది. పవన్ కళ్యాణ్ స్థాయి అది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనికి సంబదించిన ఈ వీడియో ప్రస్తుతం జనసైనికుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “మోదీ, షాలు పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనని” వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సంఘటన కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే అయినా, రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చలు చెలరేగాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కొత్త విధానాలను తీసుకురావడమే కాకుండా, ఆయనకు కేంద్రమంత్రి అమిత్ షా చూపించిన ప్రత్యేక ప్రాధాన్యతను అభిమానులు, వ్యతిరేకులు రెండు విధాలుగా విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్కటి చాలు కేంద్ర పెద్దల వద్ద పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రాముఖ్యత ఉందొ అంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు.