Amit Shah : కుప్పంగిప్పం జాన్తానై.! షా ఆప‌రేష‌న్ షురూ!!

తెలుగుదేశం పార్టీ మీద అమిత్ షా మ‌నసు మార్చుకున్నాడా? కుప్పం రిజ‌ల్డ్ త‌రువాత యూట‌ర్న్ తీసుకున్నాడా? అనే అంశంపై ఏపీ బీజేపీలోని గ్రూప్ లు ఒక్కో లా చెప్పుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - November 18, 2021 / 03:13 PM IST

తెలుగుదేశం పార్టీ మీద అమిత్ షా మ‌నసు మార్చుకున్నాడా? కుప్పం రిజ‌ల్డ్ త‌రువాత యూట‌ర్న్ తీసుకున్నాడా? అనే అంశంపై ఏపీ బీజేపీలోని గ్రూప్ లు ఒక్కో లా చెప్పుకుంటున్నాయి. కుప్పం మున్సిప‌ల్ ఫ‌లితం గురించి బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్ ఫోక‌స్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో బ‌ల‌హీన ప‌డింద‌నే విష‌యాన్ని ఢిల్లీకి చేర్చ‌డానికి నానా తంటాలు ప‌డుతోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇటీవ‌ల తిరుప‌తిలో అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేని బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్, ఇప్పుడు కుప్పం ఫ‌లితాల‌ను సానుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పొలిటిక‌ల్ టాక్.

ఏపీలో బీజేపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి బ‌లం లేదు. ఒంట‌రిగా పోటీ చేసి డిపాజిట్లు ద‌గ్గించుకున్న దాఖ‌లాలు ఎక్క‌డా లేవు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సంద‌ర్భాల్లో మాత్ర‌మే గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్ల‌ను పొంద‌గ‌లిగింది. ఇక జ‌న‌సేన తో క‌లిసి పార్టీ న‌డుస్తున్న‌ప్ప‌టికీ డిపాజిట్ల‌ను తిరుప‌తి పార్ల‌మెంట్ తో స‌హా ఎక్క‌డా సంపాదించుకోలేక పోయింది. ఇటీవ‌ల జ‌రిగిన బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో నామ‌మాత్రపు ఓట్ల‌ను మాత్ర‌మే పొందింది.
ఈ ప‌రిణామాల‌న్నింటినీ అధ్య‌య‌నం చేసిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు తెలుగుదేశం పార్టీకి అనుకూల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పైగా అమిత్ షా లాంటి లీడ‌ర్ అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం గురించి ప్ర‌స్తావించాడు. ఆ ఉద్య‌మం టీడీపీ మ‌ద్ధ‌తుతో సాగుతుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ..సో వాట్ మీరెందుకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంలేద‌ని సాక్షాత్తూ బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజుకు చివాట్లు పెట్టాడు. ఈ మాటే టీడీపీ ప‌ట్ల బీజేపీ సానుకూలంగా ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ఇక్క‌డే బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్ గొంతులో వెల‌క్కాయ‌ప‌డింది.

Also Read :  చంద్ర‌బాబు రాజ్యంలో పుంగ‌నూరు రెడ్డి!

ప‌లు సంద‌ర్భాల్లో ఇటీవ‌ల జ‌న‌సేన కూడా తెలుగుదేశం పార్టీతో క‌లిసి న‌డుస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా జ‌న‌సేన త‌ర‌హాలో న‌డ‌వ‌డానికి సిద్ధంగా ఉంద‌నే సంకేతాల‌ను అమిత్ షా తిరుప‌తి మీటింగ్ లో ప‌రోక్షంగా ఇచ్చేశాడు. ఆనాటి నుంచి బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్ అద‌నుకోసం చూస్తోంది. ఇప్పుడు కుప్పంతో పాటు మున్సిపాల్ ఎన్నిక‌ల ఫలితాల‌ను చూపిస్తూ వైసీపీ బ‌లాన్ని బీజేపీ పెద్ద‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ట‌.
బీజేపీలోని చంద్ర‌బాబు గ్రూప్ మాత్రం కుప్పంలో జ‌రిగిన పోలింగ్ తీరును ఢిల్లీ పెద్ద‌ల‌కు సినిమా మాదిరిగా చూపిస్తున్నార‌ట‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌పై చేసిన స‌ర్వేల‌ను ఫోకస్ చేస్తూ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుకు బాట‌లు వేస్తున్నార‌ని తెలిసింది. బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్‌, బీజేపీ అధ్య‌క్షుడు వీర్రాజు ల‌పై షా మండిప‌డిన తీరును గ‌మ‌నిస్తే, బీజేపీలోని బాబు గ్రూప్ చ‌క్రం తిప్పిన‌ట్టే క‌నిపిస్తుంది. తొలి నుంచి పార్టీలో ఉన్న లీడ‌ర్లు మాత్రం ఏపీ బీజేపీ పోక‌డ‌పై విస్మ‌యం చెందుతోంది.

Also Read : రైతుల కోసం సోలార్ విద్యుత్…సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న ఏపీ ప్ర‌భుత్వం

పార్టీ బ‌లోపేతం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌నే విష‌యాన్ని గ్ర‌హించిన అమిత్ షా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే లీడ‌ర్ల‌ను తీసుకోవాల‌ని బాహాటంగా చెప్పేశాడు. విడత‌ల వారీగా వైసీపీలోని సీనియ‌ర్లు, ఇత‌ర రెబ‌ల్స్ ను బీజేపీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ జాబితాలోని మొద‌టి వ‌రుస‌లో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు ఉన్నాడు. ఆయ‌న‌తో పాటుగా క‌నీసం 60 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు బీజేజీతో టాచ్ లో ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌లు ప‌లు మార్లు చెప్పిన విష‌యం విదిత‌మే. కానీ, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆల‌స్యం చేస్తున్నాడ‌ని ఢిల్లీ పెద్ద‌ల అనుమానం. అందుకే ఆయ‌న మీద అమిత్ షా ఫైర్ అవుతున్నాడ‌ని టాక్‌.
ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్ చంద్ర‌బాబు మీద వ్య‌తిరేకంగా ఎన్ని నివేదిక‌లు ఇచ్చిన‌ప్ప‌టికీ అమిత్ షా మారే ప్ర‌స‌క్తేలేద‌ని ఢిల్లీ బీజేపీ వ‌ర్గాల స‌మాచారం. కుప్పం ఫ‌లితాల‌ను చూపించిన‌ప్ప‌టికీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వైసీపీ మీద త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే బీజేపీలోని జ‌గ‌న్ గ్రూప్ ను త‌ప్పించేందుకు ఢిల్లీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. సో..బాబు గ్రూప్‌, జ‌గ‌న్ గ్రూప్ మ‌ధ్య ఏపీ బీజేపీ నడిచే క్ర‌మానికి అమిత్ షా త్వ‌ర‌లోనే ఫుల్ స్టాఫ్ పెట్ట‌బోతున్నాడ‌న్న‌మాట‌‌.