టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)తో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. విశాఖపట్నంలో తనని.. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1పై ఎలా పోరాడాలో అనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, చంద్రబాబు హక్కులను కాలరాయడంపై పవన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం పెంచడానికి ఏం చేయాలి. కుప్పంలో జరిగిన ఘటనపై చంద్రబాబును పరామర్శించాను. నేను వారాహి కొనుక్కుంటే మీకేం ఇబ్బంది. మీరు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి వెహికల్స్ కొనుక్కోవచ్చు. నేను బ్యాంకులో లోన్ తీసుకొని వారాహి కొనుక్కున్నాను. ప్రచార వెహికల్ తీసుకోవడం సహజం. నేను బయట అడుగుపడితే వైసీపీ నాయకులకు ఎందుకంత భయం అని పవన్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పొత్తులు సహజం అన్నారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. అదే పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారి ఏపీలోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీంతో ఎన్నికల్లో సమయంలో చాలా పొత్తులు ఉంటాయన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాశనం చేయడమే వైసీపీ అజెండా అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జీవో నెంబర్ 1 ద్వారా వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో ఏపీ ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు అని ఆరోపించారు. వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలని చంద్రబాబు ఆరోపించారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతామని వివరించారు.
Also Read: Thick Fog Covers North India: ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. ఆలస్యంగా రైళ్లు, విమానాలు
అంతకముందు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కల్యాణ్ చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లగానే అక్కడి పరిసరాలను చూసి పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయారు. గోడలు, గార్డెన్ ఆసక్తిగా చూస్తూ పలు ప్రశ్నలు అడిగారు. దానికి చంద్రబాబు కూడా బదులిస్తూ ఆ వివరాలను వెల్లడించారు. మరోవైపు తన ఇంటికి వచ్చిన పవన్‌ను చంద్రబాబు గేటు వరకు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.
వైసీపీ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జనసేనను టీడీపీలో కలిపేయాలి. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్‌కు నైతిక విలువలు లేవు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు 175 గెలుస్తుంది అని అన్నాడు. పవన్ కళ్యాణ్- చంద్రబాబు భేటీపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్ వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మామూళ్ల కోసం దత్తత తండ్రి దగ్గరకు దత్త పుత్రుడు వెళ్లాడు అంటూ ట్వీట్ చేశారు.