Ambati Rambabu : అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం అంటున్న సొంత పార్టీ నేతలు

ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి సొంత పార్టీ (YCP) నేతలకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ (JAGAN). దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే వారికీ సంకేతాలు పంపించారు కూడా. ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు సదరు నేతలు. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ ఆఫీసుల తలుపులు తెరిచి ఉండడంతో […]

Published By: HashtagU Telugu Desk
Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet

ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి సొంత పార్టీ (YCP) నేతలకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ (JAGAN). దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే వారికీ సంకేతాలు పంపించారు కూడా. ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు సదరు నేతలు. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ ఆఫీసుల తలుపులు తెరిచి ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే తరుణంలో టికెట్ దక్కించుకునే నేతలకు సైతం వైసీపీ అసమ్మతి నుండి వ్యతిరేకత వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్షనేతలే కాదు సొంత పార్టీ నేతలు , కార్యకర్తలు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్నీ వారు నేరుగా ఎంపీ విజయసాయి రెడ్డికి తెలియజేసారు. అంబటి గెలిచిన తర్వాత నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని..సొంత పార్టీ లోనే గ్రూపులుగా విడిపోవాల్సి వచ్చే పరిస్థితి అంబటి తీసుకొచ్చారని వారంతా వాపోయారు. అంబటి వద్దు… జగనన్నే ముద్దు అని నినాదాలు చేస్తూ విజయసాయి ఇంటి ముందు ఆందోళన చేసారు. సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి గడప గడపకు కార్యక్రమాన్ని అంబటి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అంబటికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని హెచ్చరించారు. స్థానికులకే ఈసారి సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే రాంబాబు ను ఓడించాలని చూస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి రాంబాబు ఎంత చేసాడో…

Read Also : CM Revanth First International Tour : ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 29 Dec 2023, 03:13 PM IST