Ambati Rayudu : రాయుడు ముందే వైసీపీ ఓటమిని గ్రహించాడా..? అందుకే రాజీనామా చేశాడా..?

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 12:27 PM IST

వైసీపీ(YCP) పార్టీకి ప్రతి రోజు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ లో సీనియర్ నేతలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మాత్రమే కాదు కొత్తగా పార్టీ లో చేరిన వారు సైతం పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వారం క్రితం ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అంబటి రాయుడు పార్టీ లో చేరడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక గెలుపు మాదే అన్నట్లు తెగ హడావిడి చేసారు. కానీ అంబటి రాయుడు మాత్రం పట్టుమని పది రోజులు గడవకముందే రాజీనామా (Ambati Rayudu quit From YCP) చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ” రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న..తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా..” అని పోస్ట్ చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

2023 ఐపీఎల్ లో చెన్నై టీం నుంచి ఆడుతున్న సమయంలోనే పలు సందర్భాల్లో రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ కార్యక్రమాలను ప్రశంసించారు. పలు చర్చల్లోనూ జగన్ ను ఎందుకు అభిమానించిందీ వివరించారు. తనకు క్రికెట్ లో ధోనీ గాడ్ ఫాదర్..రాజకీయాల్లో జగన్ గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. 2023 ఐపీఎల్ గెలిచిన తరువాత చెన్నై టీం యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత రాయుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయినట్లుగా వ్యవహరించారు. ఇక అప్పటి నుండి రాయుడు కు గుంటూరు ఎంపీ టికెట్ ను జగన్ ఖరారు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇక రీసెంట్ గా వైసీపీ లో అధికారికంగా చేరగానే అంత గుంటూరు ఎంపీ టికెట్ రాయుడుకే అని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ ఇప్పుడు సడెన్ గా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తో..గుంటూరు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం వల్లే రాయుడు పార్టీ కి రాజీనామా చేసి ఉంటారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

గత కొద్దీ రోజులుగా జగన్ రాష్ట్రంలో సర్వేలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేల ప్రకారం ఆయా వారికీ టికెట్ ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కు సర్వే ల్లో పూర్తిగా వ్యతిరేకత వస్తున్న క్రమంలో వారికీ టికెట్ ఇచ్చేందుకు జగన్ ఇంట్రస్ట్ చూపించడం లేదు. వారి స్థానాల్లో కొత్త వారికీ టికెట్ ఇస్తున్నాడు. దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు బయటకు వచ్చి జగన్ ఫై విమర్శలు చేసారు. సర్వేల పేరుతో తమ గొంతు కోసరంటూ వారంతా వాపోయారు.

ఇక ఇప్పుడు రాయుడు విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. రాయుడిని గుంటూరు లేదా నర్సరావు పేట నుంచి బరిలోకి దింపే విధంగా పార్టీ ఆలోచన చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించగా..రాయుడుకు అనుకూలంగా ఎవరు స్పంధికపోవడం తో పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని చెప్పడంతో రాయుడు పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

మరికొంతమంది మాత్రం రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందుతుందని ..అలాంటి ఆ పార్టీ లో ఎందుకు చేరినట్లు చెప్పడం..వైసీపీ లో చేరిన దగ్గరి నుండి చాలామంది రాయుడు ఫై విమర్శలు చేస్తుండడం తో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికి రాయుడు వల్ల తమ పార్టీ కి ప్లస్ అవుతుందని భావించిన వైసీపీ కి భారీ షాక్ తగిలినట్లైంది.

Read Also : మహేష్ బాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది..?