Site icon HashtagU Telugu

Ambati Rayudu : వైసీపీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

Ambati Rayudu Key Comments On Ycp

Ambati Rayudu Key Comments On Ycp

మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసారు. వైసీపీ పార్టీలో ఆధిపత్య ధోరణి, రాచరికాన్ని చూసి ఉండలేకపోయానన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో పర్యటించిన ఆయన.. గతంలో వైసీపీలో చేరినా ఆ పార్టీలోని ఆధిపత్య ధోరణి, రాచరికాన్ని చూసి అందులో ఉండలేకపోయానని తెలిపారు. వైసీపీలోని వాతావరణం చూశాక ప్రజాసేవకు సరైన వేదిక కాదనిపించింది. అందుకు వెంటనే పార్టీని వీడాను. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆశయాలు నాకు బాగా నచ్చాయి. ప్రజలందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

అంబటి రాయుడు..ముందుగా వైసీపీపార్టీ లో చేరడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక గెలుపు మాదే అన్నట్లు తెగ హడావిడి చేసారు. కానీ అంబటి రాయుడు మాత్రం పట్టుమని పది రోజులు గడవకముందే రాజీనామా (Ambati Rayudu quit From YCP) చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన సమక్షంలో జనసేన లో చేరారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచార వేడి వాడి వేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తుండడంతో అభ్యర్థుల్లో రోజు రోజుకు విజయం ఫై మరింత ధీమా పెరిగిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా..బిజెపి అభ్యర్థులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తూ కూటమిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ వస్తున్నారు.