Site icon HashtagU Telugu

Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu: భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నాడు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అంబటి ఫ్యాన్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసీపీలో జాయిన్ అయిన అంబటి రాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక అంబటి రాయుడు రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

భారత టీమ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అంబటి రాయుడు ఈ ఏడాది జెంటిల్మన్ గేమ్​కు వీడ్కోలు పలికారు. అనంతరం అంబటి ఏపీ సీఎం జగన్ ను రెండుసార్లు కలిశారు. ఏపీలో స్పోర్ట్స్ కు సంబంధించి డెవలప్ మెంట్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని రాయుడు ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు.

Also Read: Bread Pakodi: సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పకోడి.. ఇంట్లోనే చేసుకోండిలా?