Ambati Rayudu : జనసేన తరుపున ప్రచారంలో అంబటి రాయుడు బిజీ బిజీ ..

క్లీన్ ఇమేజ్, విజనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. యువత భవిష్యత్ మెరుగుపడాలంటే NDA కూటమిని గెలిపించుకోవాలి' అని ఆయన ప్రచారంలో పిలుపునిచ్చారు

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 07:51 PM IST

వైసీపీ (YCP)లో బానిసత్వం సహించలేకే ఆ పార్టీకి రాజీనామా చేసానని.. ‘సేవ చేయాలనే లక్ష్యంతోనే జనసేనలో చేరా. క్లీన్ ఇమేజ్, విజనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. యువత భవిష్యత్ మెరుగుపడాలంటే NDA కూటమిని గెలిపించుకోవాలి’ అని అంబటి రాయుడు( Ambati Rayudu ) ప్రచారంలో పిలుపునిచ్చారు. ఏపీలో పోలింగ్ కు సరిగ్గా 10 రోజుల సమయం మాత్రమే ఉండడం తో కూటమి పార్టీల నేతలు తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జనసేన తరుపున బుల్లితెర , వెండితెర ప్రముఖులు రంగంలోకి దిగి..పిఠాపురం లో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక ఈరోజు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సైతం జనసేన కోసం ప్రచారం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అవనిగడ్డ జనసేన MLA అభ్యర్థి బుద్ధప్రసాద్ల తరఫున ఆయన అవనిగడ్డలో ప్రచారం చేశారు. ఈ సందర్బంగా జగన్ ఫై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ పార్టీ లో బానిసత్వం తప్ప మరొకటి లేదని అంబటి రాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులా బ్రతకాల్సిందేనన్నారు. ఆయనకు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేతకాదన్నారు. బటన్ తో పాటుగా బొచ్చె కూడా ఇస్తాడన్నారు. జగన్ కి మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికే అని హెచ్చరించారు. క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యపరిచాడంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సిక్స్ కొట్టండి. 6 వ నంబర్ పై నొక్కండంటూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఓటర్లను కోరారు.

తాను క్రికెట్ అడుతూనే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాష్ట్రమంతా 7 నెలల పాటు పర్యటించానని తెలిపారు. జగన్ తో కొంతకాలం ప్రయాణం చేశానన్నారు.కానీ వైసీపీలో కొనసాగితే ప్రజాసేవ చేయలేమని తెలుసుకున్నానన్నారు. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి ఉండదని రాయుడు అన్నారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాళ్ళ కింద గుమ్మం ముందు చెప్పుల్లా ఉండాల్సిందేనన్నారు. అధికారం చేపట్టాక దోచుకోవడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని పుర్తిగా వెనుకబడిపోయేలా చేశారన్నారు. ఒక ప్రాజెక్ట్ కట్టడం కానీ, ఒక పరిశ్రమను తీసుకుని రావడం కానీ చేయకుండా బటన్లు నొక్కడమే అధికారం అన్నట్లుగా జగన్ పరిపాలన చేస్తున్నాడన్నారు. ఇక అంబటి రాయుడు ముందుగా వైసీపీ లో చేరారు..పది రోజులు కూడా ఉండలేక పార్టీకి రాజీనామా చేసారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన లో చేరారు.

Read Also : AP : జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై పేర్ని కిట్టు అనుచరుల దాడి..