TDP : రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ – అంబటి సెటైర్

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 09:29 PM IST

రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ (TDP) తప్పుకోవడం ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘రాజ్య సభలో కుర్చీ మడతేసిన టీడీపీ. అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా’ అని ఆయన పోస్ట్ చేసారు. ఇక రాజ్యసభ ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వైసీపీ ఖాతాలో మూడు రాజ్యసభ స్థానాలు పడనున్నాయి. రాజ్యసభలో వైసీపీ బలం 11 కు పెరగనుంది. అదే సమయంలో టిడిపికి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడం ఇదే మొదటిసారి. 1983 నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం ఉన్నది. కానీ, ఇప్పుడు ఉన్న ఒక్క రాజ్యసభ ఎంపీ పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీకి చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సీఎం రమేష్, కనకమెడల రవీంద్రల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆ మూడు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది. వివిధ సమీకరణల దృష్ట్యా సీఎం జగన్ వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు లను రాజ్యసభస్థానాలకు ఎంపిక చేశారు. అటు టిడిపి సైతం పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నుంచి వర్ల రామయ్య, కోనేరు సతీష్ తదితరుల పేర్లు ప్రచారం జరిగాయి. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతుండడంతో… టికెట్లు దక్కని సిట్టింగులు టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని… గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని అంత అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాజ్యసభ ను లైట్ తీసుకున్నారు. దీంతో వైసీపీ కి చేతికి చిక్కినట్లు అయ్యింది.

Read Also : Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు