Site icon HashtagU Telugu

Vontimitta-Pulivendula ZPTC Election Results : రిగ్గింగ్ అంటూ అంబటి సెటైర్

Tdp Vijayam

Tdp Vijayam

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల ZPTC ఎన్నికల ఫలితాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాలు IPS కోయ ప్రవీణ్ కు అంకితం అంటూ ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు, రిగ్గింగ్ వీడియో పోస్ట్‌పై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.

అంబటి రాంబాబు తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో పులివెందులలో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై టీడీపీ శ్రేణులు వెంటనే స్పందించాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగిన ఒక పాత వీడియోను తీసుకొని, దాన్ని పులివెందులకు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.

Pulivendula : ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు మెసేజ్‌..!

అంబటి రాంబాబు పోస్ట్ చేసిన వీడియో, దానిపై టీడీపీ కౌంటర్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. పులివెందుల ZPTC ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

ఒక వైపు వైఎస్సార్సీపీ నాయకులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తుంటే, టీడీపీ శ్రేణులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి ప్రచారాలు, కౌంటర్లు సర్వసాధారణమే అయినా, పాత వీడియోలను ఉపయోగించి అసత్య ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఇక పులివెందులలో టీడీపీ తొలిసారి విజయం సాధించింది. వైఎస్ జగన్ అడ్డాలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ ఈ ఫలితాలు తలెత్తుకోకుండా చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.