Site icon HashtagU Telugu

Ambati Rambabu : అంబటి రాంబాబు సంబంధించి మరో బండారం బయటపెట్టిన అల్లుడు

Ambati Alludu

Ambati Alludu

మరో ఐదు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు (Ambati Rambabu) కు వరుస షాకులు ఇస్తున్నాడు అయన అల్లుడు గౌతమ్ (Ambati Rambabu Son In Law Gautham). ఇప్పటికే గౌతమ్ ఓ వీడియో రిలీజ్ చేసాడు. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని.. అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం.. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి అని ఓటర్లను కోరారు. ఈ వీడియో వైరల్ కావడం తో దీనిపై అంబటి రియాక్ట్ అయ్యాడు. తన కూతురు ..అల్లుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని..గత కొద్దీ ఏళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని..కూతుర్ని , పిల్లలను తానే చేసుకుంటున్నట్లు తెలిపారు. తన అల్లుడు ఇలా మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది దుర్మార్గం కాదా? ఒక కుటుంబ విషయాన్ని ఇంత తీవ్రస్థాయిలో రచ్చకీడ్చి రాజకీయ లబ్ధి పొందడాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఇప్పుడు గౌతమ్ మరో వీడియో రిలీజ్ చేసాడు. ఇందులో రాంబాబు కు సంబదించిన కీలక విషయాలను పంచుకున్నాడు. తన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా తన మనవడు, మనవరాలిని చూడనివ్వకుండా చేశారని వాపోయారు. రెండ్రోజుల క్రితం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలు చెప్పారని, తన మామయ్య ఇంత మంచివాడా అని 2 నిమిషాలపాటు తానే నమ్మేశానన్నారు. నిజంగానే ఇసుమంత మంచితనం ఉంటే బాగుండేదన్నారు. నాలుగేళ్లుగా తన మనవడు, మనవరాలు తనవద్దే ఉన్నారని, వారిని ఆర్థికంగా తానే చూసుకుంటానని చెప్పారన్నారు. అల్లుడిగా తాను ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు కాబట్టి దుర్మార్గుడిని తానే అవుతానని చెప్పారన్నారు. తనవెనుక మోదీ, పవన్, చంద్రబాబు ఉండి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారని తెలిపారు. అయితే తాను చెప్పింది ఎంత నిజమో తెలియాలంటే ఒక వీడియో చూడాలని చెబుతూ.. 2023, మార్చి3న పంపిన తన తండ్రి వీడియోను చూపించారు.

అందులో గౌతమ్ తండ్రి.. తనకు మనవడు, మనవరాలిని చూడాలని ఉందని, వాళ్లని అర్జెంటుగా పంపాలని ఐసీయూలో ఉండి విజ్ఞప్తి చేసారు. ఆఖరి క్షణాల్లో తన తండ్రి వారసులను చూసుకోలేకపోయానని ఎంతో బాధపడ్డారని మీకు తెలుసా ? అని అంబటిని ప్రశ్నించారు. అంబటి వారి ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే దుర్మార్గులవుతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని నమ్మి, విసుగెత్తి కోర్టుకు వెళ్తే దుర్మార్గుడిగా ముద్రవేశారన్నారు. తన కొడుకు, కూతురిని పోషించనక్కర్లేదని, రేపే మీడియా సమక్షంలో ఆయన ఇంటికి వెళ్తే పిల్లలను అప్పగించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. లేదనుకుంటే వాళ్లే వచ్చి తన ఇంట్లో దింపి వెళ్లగలరా అని ప్రశ్నించారు.

Read Also : Vote For Pawan Kalyan : మీ భవిష్యత్ కోసం పాటు పడే పవన్ కల్యాణ్ ను గెలిపించండి – రామ్ చరణ్