Site icon HashtagU Telugu

Ambati Rambabu Tweet : లోకేష్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ..? అంటూ అంబటి ట్వీట్

Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet

చంద్రబాబు (Chandrababu) అక్రమ కేసులో అరెస్ట్ అవ్వడం..బెయిల్ కూడా రాకుండా వైసీపీ (YCP) చేస్తుండడం..మరోపక్క లోకేష్ (Nara Lokesh Arrest) ను సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు ప్రచారం అవుతుండడం టీడీపీ (TDP) శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయినా దగ్గరి నుండి దాదాపు 30 కి పైగా టీడీపీ అభిమానులు మనోవేదనకు గురై చనిపోయారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బాధపడే వ్యాఖ్యలు చేస్తూ ఆనంద పడుతున్నారు. మంత్రి రోజా అయితే చంద్రబాబు అరెస్ట్ కాగానే పెద్ద ఎత్తున స్వీట్స్ పంచి , బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంది.

Read Also : Sidharth Luthra Tweet: ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది..” అంటూ సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ ..

ఇక ఇప్పుడు వరుసగా చంద్రబాబు కు షాకులు తగులుతుండడం తో మరింత సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu Tweet) అయితే లోకేష్ గారు ఎక్కడ అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసాడు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని, ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ అయితే పరారీలో లోకేశ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ” హలో… లోకేశ్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ? అంటూ వ్యగంగా ట్వీట్ చేసాడు. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

https://x.com/AmbatiRambabu/status/1705179083955687814?