Site icon HashtagU Telugu

BRO Controversy: అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు శునకానందం పొందొద్దని

BRO Controversy

New Web Story Copy 2023 08 10t191614.942

BRO Controversy: బ్రో సినిమా వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. బ్రో చిత్రంలో అంబటి రాయుడు సంక్రాంతి నృత్యాన్ని జోడించడంపై వివాదం నెలకొంది. దీంతో వైసీపీ ఘాటుగా స్పందించింది. మరీ ముఖ్యంగా బాధితుడు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాయుడు ఘాటుగా స్పందించారు. అందులో భాగంగా బ్రో విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ వెళ్లి ఈడీకి ఫిర్యాదు కూడా చేశాడు. తనని సినిమాలో చూపించినందుకు పవన్ కళ్యాణ్ పై మ్రో సినిమా తీస్తానంటూ ఇప్పటికే ప్రకటించాడు. ఇదంతా సినిమా పంచాయితీ. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ మరోసారి వివాదాన్ని లేవనెత్తినట్లయింది.

పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, అతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ వేడుకొన్నది. బ్రో వివాదం తనకు తెలియదని పేర్కొంది. అయితే రేణు దేశాయ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. బ్రో వివాదం ముగిసిందనుకున్న సమయంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి వైసీపీపై వ్యాఖ్యలు చేయడం, నేడు రేణు దేశాయ్ స్పందించడం ద్వారా వివాదానికి మళ్ళీ ప్రాణం పోసినట్టయింది.

Also Read: Iqoo Z7 pro 5G: మార్కెట్ లోకి మరో కొత్త ఐక్యూ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?