సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ (Kommineni Srinivasa Rao) కావడం మీడియా, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల సాక్షి ఛానల్‌లో ప్రసారమైన ఓ డిబేట్ కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ప్రతికూలత వ్యక్తమవుతోంది. “అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని” అన్న వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కొమ్మినేనిపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన కృష్ణం రాజు వ్యాఖ్యలను సమర్థించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Padi kaushik Reddy : పాడి కౌశిక్‌రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షి టీవీ డిబేట్ వీడియోను పరిశీలించి, కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, కృష్ణం రాజును ఏ1గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్‌బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఆదివారం హైదరాబాదులోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచే ఏర్పాట్లు చేశారు.
French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న కార్లోస్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
మరోవైపు, ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణం రాజు కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆయన విజయవాడలోని ఇంటికి తాళం పడిన నేపథ్యంలో, హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ అరెస్టుపై వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందిస్తూ..”కొమ్మినేని కమ్మ కులస్థుడయినా తనను విమర్శిస్తున్నారని చంద్రబాబుకు కక్ష” అంటూ అంబటి ట్వీట్ చేశారు. దీనిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు.