AP : హైకోర్టులో మంత్రి అంబటి పిటిషన్..వైసీపీ గట్టి ప్లానే..!!

నెగిటివ్‌ పాయింట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్‌లో కొందరు నేతల మాట

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 10:56 AM IST

ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ఈ పిటిషన్‌లో చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అయితే సడెన్ గా అంబటి పిటిషన్ వేయడం వెనుక వైసీపీ పెద్ద ప్లానే వేసిందని అంత అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మాచర్ల ఎమ్మెల్యే (Macherla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ను ధ్వంసం చేసిన ఘటన గురించి అంత మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే..ఇలాంటి పని చేయొచ్చా..అని అంత విమర్శిస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ ఘటన ను విస్తృతంగా ప్రచారం చేస్తూ వైసీపీ ఫై తీవ్ర ఆరోపణలు , విమర్శలు చేస్తూ వస్తుంది. ఇది రోజు రోజుకు మరింత ఎక్కువై అవకాశం ఉండడం తో దీని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడకూడదనే ఉద్దేశ్యంతో వైసీపీ..మంత్రి అంబటి తో పిటిషన్ వేసినట్లుందని పలువురు అంటున్నారు. నెగిటివ్‌ పాయింట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్‌లో కొందరు నేతల మాట. పిన్నెల్లిపై పొలిటికల్ హీట్ తగ్గించేందుకు ఈసారి అంబటి రాంబాబు రంగంలోకి దింపినట్టు అంత చెప్పుకుంటున్నారు.

మే 13 జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ చేపట్టాలని అందులో ప్రస్తావించారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా ఐదుగుర్ని చేర్చారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. మే 13న ఎన్నికలు జరిగితే దాదాపు 10 రోజుల తర్వాత మంత్రి అంబటి రీపోలింగ్‌పై పిటిషన్ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ తర్వాత ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా క్లియర్‌గా చెప్పారు. రీపోలింగ్‌కు చేపట్టాలని ఎక్కడ నుంచి రిపోర్టులు రాలేదన్నారు. అయినా పోలింగ్ జరిగిన మరుసటి రోజు అంబటి పిటిషన్ వేస్తే బాగుండేదని, దాదాపు పది రోజుల తర్వాత దాఖలు చేయడం కరెక్టు కాదని పలువురు రాజకీయ నేతలంటున్నారు. మరి దీనిపై కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read Also : Helicopter Crashes : హెలికాప్టర్లు ఎందుకు కూలుతాయి ? కారణాలు ఏమిటి ?