పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం *They Call Him OG* ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్‌లో ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే థమన్ అందించిన పాటలు భారీ హైప్‌ను సృష్టించాయి. కానీ ప్రచార పరంగా మాత్రం ఈ సినిమా ఆలస్యంగా ముమ్మరమైంది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి కార్యక్రమాలు చివరి రోజుల్లో మాత్రమే లాక్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
అయితే సినిమాపై పెరిగిన అంచనాలతో పాటు టికెట్ ధరల పెంపు అంశం కొత్త వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘OG’ సినిమాకు భారీ టికెట్ ధరలు నిర్ణయించడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “Dy.CM సినిమాలో నటిస్తే టికెట్ ధర రూ. వెయ్యి పెడతారా? అధికారంలో ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? ప్రజల డబ్బు దోచుకోవడం ఎప్పటికీ కుదరదు” అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుండగా, అభిమానులు మాత్రం సినిమాపై ఉన్న ఆసక్తిని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు.
Rain Alert : ఈరోజు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కాబినెట్ సమావేశాలకు కూడా పూర్తిగా హాజరుకావడం లేదని, కేవలం సినిమాల కోసం మాత్రమే బయటపడుతున్నారని అంబటి రాంబాబు మరోసారి విమర్శించారు. పవన్ అసెంబ్లీకి గానీ, క్యాబినెట్ మీటింగ్లకు గానీ హాజరుకాకుండా, సినిమా ప్రమోషన్ల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ద్వంద్వ వైఖరిని చూపుతోందని ఎద్దేవా చేశారు. దీంతో ఒకవైపు సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటే, మరోవైపు రాజకీయ రంగంలో ఆయనపై విమర్శలు ముమ్మరమవుతున్నాయి. మొత్తం మీద ‘OG’ సినిమా విడుదల చుట్టూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

