Site icon HashtagU Telugu

Ambati Rambabu : ఏపీలో పవన్ ఎప్పటికి సీఎం కాలేడు – అంబటి కౌంటర్

Ambati Rambabu Pawan Kalyan

Ambati Rambabu Pawan Kalyan

ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ (Jagan) జర్మనీకి వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వాఖ్యలకు అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరించిన తీరు పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని తేల్చిచెప్పారు.

Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం

జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్సార్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్సార్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వైఎస్సార్సీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు.

కాగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే’ అని సెటైర్ వేశారు. గోవాలో 40 స్థానాలుండగా 21 మ్యాజిక్ ఫిగర్. ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు. దీనికి జనసేన శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.