Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి

నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Ambati vs Chandrababu

Ambati vs Chandrababu

Ambati vs Chandrababu: నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

చంద్రబాబు అమర్యాదగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబుకు సొంత పార్టీలో బలమైన నాయకులు లేరని విమర్శించిన ఆయన, వెనుకబడిన వారే ఇప్పుడు టీడీపీలో పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా చంద్రబాబు సమావేశాలు విఫలమయ్యాయని విమర్శించారు. తక్కువ మంది ప్రజలు సమావేశాలకు హాజరవుతుండటం ఆయన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ బీజేపీలోకి విలీనం అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు అంబటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

We’re now on WhatsAppClick to Join

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. పొత్తు పెట్టుకోవడం అపజయం లాంటిదని, వైఎస్సార్‌సీపీ నుంచి పోటీని ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా లేదని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు ఓటమి తప్పదని సూచించారు.

Also Read: Vijay Devarakonda: ఆ కారణం వల్లే విజయ్ పై నెగిటివిటి పెరిగిందా.. భారీగా ట్రోల్స్!

  Last Updated: 07 Apr 2024, 01:42 PM IST