Site icon HashtagU Telugu

Polavaram Project : చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి – మాజీ మంత్రి అంబటి

Ambati Rambabu Polavaram

Ambati Rambabu Polavaram

2018లోపే పోలవరం (Polavaram Project) పూర్తి చేస్తామని చంద్రబాబు (Chandrababu) చెప్పారు.. పోలవరానికి జగన్‌ ద్రోహం చేశారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తూ.. జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ ఫై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఫై అంబటి (Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేసారు.

సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం (Polavaram ) ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్న ఆయన..చెప్పినట్లు నిన్న ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు చేరుకున్న చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని , ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. 2014-2019 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుంది. డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించకుండా మీన మేషాలు లెక్కలేశారు. మళ్లీ మొత్తం డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలంటే రూ. 997 కోట్లు కావాలి. నాలుగు చోట్ల డ్యామేజ్ అయింది. కాఫర్ డ్యామ్‌నూ నిర్లక్ష్యం చేశారు. కాఫర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల పొడవు కొట్టుకుపోయింది. 150 మీటర్ల లోతు మేర ఇసుక వేసి ఫిల్ చేయాలి. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ పనులకు దాదాపు రూ. 2500 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే 2020కే పూర్తి అయ్యేది. ఇప్పుడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు.

ఇక చంద్రబాబు చేసిన కామెంట్స్ ఫై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్‌ ద్రోహం చేశారని టీడీపీ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ… జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని , ”చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలి”..అని అంబటి హితవు పలికారు.

Read Also : Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదంలో చిన్నారి మృతి