AP : రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోవడంపై మంత్రి అంబటి క్లారిటీ

మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్..ఆ తర్వాత స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్మేవిధంగా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 03:48 PM IST

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ (AP Elections) ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం మొదలుకాబోతుంది. దీంతో అధికార పార్టీ వైసీపీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలు అధికార పార్టీ హామీలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని , ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్ (Jagan)..ఆ తర్వాత స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్మేవిధంగా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)..మద్యపాన నిషేధం (Alcohol prohibition) ఫై స్పందించారు. తాము ఇచ్చిన హామీల్లో 98%కి పైగా అమలు చేశామని, చేయలేకపోయిన 2% హామీల్లో మద్యపాన నిషేధం ఒకటని చెప్పుకొచ్చారు. ఒకేసారి నిషేధం విధిస్తే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలివస్తోందనే భావనతో అమలు చేయలేకపోయామని తెలిపారు. ఇప్పటికీ మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశం ఉందన్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు జగన్ తన బస్సు యాత్ర నారాయణపురం నుంచి ప్రారంభ‌మైంది. నారాయ‌ణ‌పురంలో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈరోజు యాత్ర నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారు చేరుకుంటుంది. ఉండి శివారులో జ‌గ‌న్‌ భోజన విరామం తీసుకున్నారు. భోజ‌నం అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Read Also : TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు