కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి (Visakhapatnam Steel Plant) కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఊపిరి పోసింది. రూ. 11,440 కోట్ల (Rs 11,500 crore) ప్యాకేజీని ఈ కర్మాగారానికి కేంద్రం అందించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూ. 17 వేల కోట్ల ప్యాకేజీగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి అధికారికంగా రూ. 11,440 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీపై కూటమి నేతలు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం కేంద్ర ప్యాకేజ్ పై సెటైర్లు వేస్తున్నారు.
Manchu Family Controversy : కలెక్టర్ వద్దకు మంచు గొడవ
తాజాగా మాజీ మంత్రి అమర్నాథ్ (Amarnath ) కేంద్ర ప్యాకేజ్ పై స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఆక్సిజన్‌లా పనిచేస్తుంది. ప్లాంట్‌కు ఉన్న అప్పుల భారం రూ.11,400 కోట్లుగా ఉండగా, ఈ అప్పుల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన సూచించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడటం అనేది రాష్ట్రం కోసం కీలకమని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించడం, సెయిల్లో విలీనం చేయడం ద్వారా ప్లాంట్‌కు ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.దీని ద్వారా స్టీల్ ప్లాంట్‌ను దృఢమైన మార్గంలో నిలుపుదల చేయవచ్చని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సహాయం అవసరమని, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని గుడివాడ అమర్నాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో ప్రైవేటీకరణను వ్యతిరేకించినట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మిక సంఘాలు గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ప్లాంట్‌ను రక్షించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ప్లాంట్‌ను సంరక్షించడం కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.