ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం (Amaravati ) మరోసారి వేగంగా ప్రారంభంకానుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అడ్డంకులను తొలగించి, టెండర్లు పూర్తిచేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా అమరావతి రీ-లాంచ్ (Amaravati Relaunch) చేయడానికి సన్నాహాలు చేస్తుంది. గతంలోనూ మోదీ అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ పనులు ప్రారంభంకాబోతున్నాయి. ఈ వేడుక ద్వారా అమరావతికి కొత్త ఊపొచ్చే అవకాశముంది.
అమరావతికి మోదీ పూర్తి మద్దతు
ఆర్థికంగా తీవ్రంగా క్షీణించిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని మోదీ ఎంతో పెద్ద స్థాయిలో అండగా నిలుస్తున్నారు. వైసీపీ పాలనలో పది లక్షల కోట్లకు పైగా అప్పుల భారం పెరగడంతో రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ మోదీ ప్రత్యేక రుణ సదుపాయాలు, కేంద్ర నిధుల సహాయంతో యాభై వేల కోట్ల రూపాయల వరకు సమకూర్చేలా చర్యలు తీసుకున్నారు. ఇది అమరావతి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాన భరోసా అవుతోంది.
కేంద్ర సహకారంతో అమరావతి భవిష్యత్తు
అమరావతి సస్టెయినబుల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దీని కోసం కేంద్రం నుంచి నిరంతర సహకారం అవసరం. రాజధాని నిర్మాణం పూర్తయిన తరువాత, ఉపాధి అవకాశాలు పెరిగి, కొత్త పెట్టుబడులు రాకుండా అభివృద్ధి సాధ్యమవదు. అందుకే, మోదీ అమరావతి రీ-లాంచ్ చేయడం చాలా ముఖ్యమైన చర్య. కేంద్రం అండదండలతో అమరావతి నిర్మాణం శరవేగంగా పూర్తి కానుంది. ఒక బలమైన రాజధాని నిర్మితమైతే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్భుతమైన మార్గదర్శకంగా మారుతుంది.
Mauritius : సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి: ప్రధాని