Amaravati padayatra: మ‌హాపాద‌యాత్రకు ఏ క్ష‌ణ‌మైనా..బ్రేక్?

అమ‌రావ‌తి రైతులు చేస్తోన్న మ‌హా పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగింది. ఎనిమిదో రోజు ప్ర‌కాశం జిల్లా ఇంకొల్లు స‌మీపంలోకి చేరింది.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 11:00 PM IST

అమ‌రావ‌తి రైతులు చేస్తోన్న మ‌హా పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగింది. ఎనిమిదో రోజు ప్ర‌కాశం జిల్లా ఇంకొల్లు స‌మీపంలోకి చేరింది. ఇక అక్కడి నుంచి యాత్ర సాఫీగా సాగే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఇప్పటికే పాద‌యాత్రను ఆపేయాలంటూ కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు స్థానిక‌ పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు. లేదంటే, అడ్డుకుంటామ‌ని ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేష‌న్ల‌లో వైసీపీ సానుభూతిప‌రులు ఫిర్యాదులు చేయ‌డానికి పోటీప‌డుతున్నారు. ఆ క్ర‌మంలో వారం పాటు సాఫీగా సాగిన న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మ‌హా పాద‌యాత్ర ముందుకు సాగ‌డం క‌ష్టమ‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.

మ‌హాపాద‌యాత్ర చేస్తే రాబోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఏపీ పోలీస్ అంచ‌నా వేసింది. అందుకే, అనుమ‌తిని నిరాక‌రించింది. హైకోర్టు ద్వారా యాత్ర‌కు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి అనుమ‌తిని పొందింది. కొన్ని ఆంక్ష‌లను విధిస్తూ, యాత్ర‌కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే, కోర్టు ఇచ్చిన నిబంధ‌ల‌ను రైతులు ధిక్క‌రించార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఆ మేర‌కు కొంద‌రు రైతుల‌కు నోటీసులు జారీ చేశారు. కేవ‌లం 150 మందికి మించి యాత్ర‌లో పాల్గొన‌కూడ‌ద‌ని కోర్టు పెట్టిన ప్ర‌ధాన ఆంక్ష‌. దాన్ని ధిక్క‌రించార‌ని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు రాజ‌ధానులు, సీఆర్డీఏ ర‌ద్దుకు సంబంధించిన అంశాల‌ను వ్య‌తిరేకిస్తూ యాత్ర ముందుకు క‌దులుతోంది. ఇవే అంశాల‌పై తొలి రోజుల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు కోరుతూ జోలి ప‌ట్టాడు. ఆ స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న మీద చెప్పులు,రాళ్లు విశాఖ‌ప‌ట్నంలో విసిరారు. అనంతంపురంలోనూ అలాంటి ప‌రిస్థితిని చంద్ర‌బాబు ఎదుర్కొన్నాడు. అందుకే, ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా జోలి ప‌ట్ట‌కుండా అర్థాంత‌రంగా ఆ కార్య‌క్ర‌మానికి స్వ‌స్తి ప‌లికాడు.

Also Read : ఆ గ్రామంలో ఆ వార్డుకి పోటీ చేస్తే చనిపోవాల్సిందేనా…?

ఇప్పుడు కూడా అమ‌రావ‌తి రైతులకు అలాంటి పరిస్తితి ఎదురు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఉత్త‌కోస్తా, దక్షిణ కోస్తా, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, మ‌ధ్య‌కోస్తా, రాయ‌ల‌సీమ‌..ఇలా చెప్పుకుంటారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌ను ఉత్త‌ర‌కోస్తాగా గుర్తిస్తారు. తూర్పు,ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను గోదావ‌రి జిల్లాలుగా చెప్పుకుంటారు. మ‌ధ్య కోస్తా కింద కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌ను ప‌రిగ‌ణిస్తుంటారు. చిత్తూరు, క‌డ‌ప‌,అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల‌ను రాయ‌ల‌సీమ‌గా భావిస్తుంటారు. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానులు నిర్ణ‌యానికి మ‌ధ్య కోస్తా లోని కృష్ణా,గుంటూరు కొంత భాగం ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లోని వాళ్లు అనుకూలంగా ఉన్నార‌ని వైసీపీ భావిస్తోంది. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌తో పాటు రాయ‌ల‌సీమ అంత‌టా వైసీపీ బ‌లంగా ఉంది. ఉత్త‌రాంధ్ర‌కు పరిపాల‌న రాజ‌ధాని వ‌స్తుంద‌ని అక్క‌డి వాళ్లు మోజార్టీ సంతోషంగా ఉన్నార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇక రాయ‌ల‌సీమ‌కు న్యాయ రాజ‌ధాని కావాల‌ని ఆ జిల్లాల ప్ర‌జ‌లు మొద‌టి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల వ‌ర‌కు మ‌హాపాద‌యాత్ర సాఫీగా సాగింది. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చిన త‌రువాత టెన్ష‌న్ నెల‌కొంది. రాయ‌ల‌సీమ స‌రిహ‌ద్దుల్లోని నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లోనూ మ‌హాపాద‌యాత్ర సాఫీగా జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని పోలీసులు రిపోర్ట్ త‌యారు చేశార‌ని తెలిసింది. ఇక రాయ‌ల‌సీమ‌కు వెళ్ల‌డానికి అనుకూల‌మైన ప‌రిస్తితులు లేవ‌ని నివేదిక‌ను త‌యారు చేసి హైకోర్టుకు ఇవ్వ‌డానికి ఏపీ పోలీస్ సిద్ధం అయింద‌ని స‌మాచారం.

Also Read : వంశధార పై ఒడిశా, ఏపీ సీఎంల భేటీ

ప్ర‌స్తుతానికి డ్రోన్ల నిఘా, పోలీసుల వ‌ల‌యం న‌డుమ వారం రోజులుగా జ‌రిగిన పాద‌యాత్ర జ‌రిగింది. ఉల్లంఘ‌న‌లు, యాత్ర‌లో జ‌న సందోహం..రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయం…తదిత‌రాల‌ను క్రోడీక‌రించి కోర్టు ద్వారా మ‌హాపాద‌యాత్ర‌ను ఆపాల‌ని ఏపీ పోలీస్ భావిస్తోంద‌ని తెలిసింది. సో..ఇక మ‌హాపాద‌యాత్ర ఎప్పుడైనా ఆగిపోయే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.