CBN Is Back : ఆ సీఎం కు పరదాలు..ఈ సీఎం కు పూల వర్షం

జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 11:44 PM IST

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది..చంద్రబాబు సీఎం అయ్యారు..ప్రజలు హ్యాపీగా ఉన్నారు..ఇక జరగాల్సింది రాజధాని అభివృద్దే. ముఖ్యంగా చంద్రబాబు సీఎం అవ్వడం పట్ల అమరావతి ప్రజలు ,రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు ఒక్క పిలుపుతో అమరావతి రాజదాని కోసం తమకున్న భూములు వదులుకున్నారు..చంద్రబాబు చెప్పినట్లే అమరావతి రాజధాని అయ్యింది..భారీ నిర్మాణాలు , అభివృద్ధి జరిగింది. కానీ ఆ తర్వాత జగన్ వచ్చి అమరావతిని కాస్త అడవిని చేసాడు. రాజధాని అమరావతి కాదంటూ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం అంటూ ఐదేళ్ల పాటు అమరావతి పక్కకు వెళ్ళలేదు..దీంతో అక్కడి రైతులు , ప్రజలు ఐదేళ్లుగా పోరాటం సాగిస్తూ వచ్చారు.

జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు. అంతే కాదు ఆయన వెళ్లే రాజధాని గ్రామాల్లో ఇళ్ల ముందు పరదాలు పెట్టి ఫోర్స్ ను నిలబెట్టేవారు. అలా చేసిన తర్వాత ఆయన కాన్వాయ్ ఆ దారి గుండా కనీసం ఎనబై కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోయేది..అటు చూసి ఇటు చూసేలోపే జగన్ మాయం అయ్యేవాడు..ఆలా ఐదేళ్ల పాటు పరదాలు చాటునే పాలనా సాగించారు. ఒక్క అమరావతి లోనే కాదు రాష్ట్రంలో ఏ పల్లె కు వెళ్లాలన్న కానీ పరదాలు కట్టుకునే వెళ్లే వారు. అలాంటి సీఎం జగన్. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది..పరదాలు మాయం అయ్యాయి..కళ్ల ముందు సీఎం కనిపిస్తున్నాడు..తమ బాధలు చెపుతాం అంటే తన కాన్వాయ్ అపి వింటున్నాడు. ఈరోజు అదే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబుకి రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఉండవల్లి నుంచి పయనమైన చంద్రబాబుకు అడుగడుగునా జననీరాజనాలు పలికారు. దారి పొడవునా పూల బాట పరిచారు. జయహో చంద్రబాబు అంటూ నినదించారు. అపూర్వ స్వాగతాన్ని చూసి చంద్రబాబు ముగ్ధులయ్యారు. ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ వారి ఆకాంక్షల సాధనే తన లక్ష్యమంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు. వాహనశ్రేణిపై పూలవర్షం కురిపించారు. కారు దిగి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబుకు క్రేన్ సాయంతో గజమాల వేశారు.

 

2019లో వైఎస్సార్సీపీ నేతలు రాళ్లు విసిరిన ప్రదేశం నుంచే చంద్రబాబుపై ప్రస్తుతం పూలవర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలుకుతూ ర్యాలీగా ఆయన వెంట తరలివెళ్లారు. ఐదేళ్ల పాటు కేసులు, దాడులు, ఆంక్షలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో కష్టాలు పడ్డామన్న రైతులు వాటన్నింటింకి ఇక కాలం చెల్లినట్లేనన్నారు. ఇకపై అమరావతి మాత్రమే కాదు రాష్ట్రమంతా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read Also :  Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్‌ దోవల్ నియామకం.. ఎవరీ దోవల్..?