Amaravati : ‘రాజ‌ధాని’ స‌భ‌ల సంద‌డి

మూడు రాజ‌ధానులు, ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి నినాదాలకు తిరుప‌తి కేంద్ర బిందువుగా మారింది. పోటాపోటీగా ఈనెల 17, 18వ తేదీల్లో ఇరు వాద‌న‌లు వినిపిస్తున్న వాళ్లు స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ మేర‌కు హైకోర్టు అనుమ‌తి ల‌భించింది. అమ‌రావ‌తి రైతులు న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం యాత్ర‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంతో ముగించారు.

  • Written By:
  • Updated On - December 16, 2021 / 03:33 PM IST

మూడు రాజ‌ధానులు, ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి నినాదాలకు తిరుప‌తి కేంద్ర బిందువుగా మారింది. పోటాపోటీగా ఈనెల 17, 18వ తేదీల్లో ఇరు వాద‌న‌లు వినిపిస్తున్న వాళ్లు స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ మేర‌కు హైకోర్టు అనుమ‌తి ల‌భించింది. అమ‌రావ‌తి రైతులు న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం యాత్ర‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంతో ముగించారు. ఆ సంద‌ర్భంగా ఈనెల 17న తిరుప‌తిలో స‌భ‌ను నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టారు. ఆ వేదిక‌పై నుంచి ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి నినాదాన్ని ఎజెండాగా ఫిక్స్ చేశారు.

రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ధ‌తుగా నినదిస్తున్నారు. ఆ నినాదానికి మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు తిరుప‌తి కేంద్రంగా ఈనెల 17న స‌భ‌ను నిర్వ‌హించాల‌ని భావించింది. ఒకే రోజులు రెండు స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డం శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్లుతుంద‌ని భావించిన హైకోర్టు ఈనెల 18వ తేదీన స‌భ‌ను నిర్వ‌హించుకోవ‌డానికి అనుమ‌తిని ఇచ్చింది.
అమ‌రావ‌తి రైతులు న‌వంబంర్ ఒక‌టో తేదీన హైకోర్టు నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. జాతీయ ర‌హ‌దారి పొడవునా ఉండే గ్రామాల‌ను క‌లుపుకుంటూ మ‌హాపాద‌యాత్ర‌ను చేశారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌జా మ‌ద్ధ‌తు ల‌భించింద‌ని వాళ్లు భావిస్తున్నారు. కానీ, ఆ యాత్ర కు టీడీపీ రంగు బాగా అల‌ముకుంది. పైగా రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉండాల‌ని భావించే గ్రామాల ద్వారా యాత్ర కొన‌సాగింది. స‌హ‌జంగా అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ధ‌తు ల‌భించింది. కానీ, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌ని వైసీపీ అంటోంది.

రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి చాలా కాలంగా రాజ‌ధాని కావాల‌ని కోరుకుంటోంది. క‌నీసం న్యాయ రాజ‌ధాని క‌ర్నూలులో పెట్టాల‌ని డిమాండ్ చేస్తోంది. దానికి బీజేపీ కూడా మ‌ద్ధ‌తు ఇచ్చింది. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌కు కూడా మ‌ద్ధ‌తు ప‌లికింది. అమిత్ షా ఆదేశం మేర‌కు రైతుల‌తో క‌లిసి బీజేపీ ఏపీ నేత‌లు న‌డిచారు. తిరుప‌తిలో పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వైసీపీ మిన‌హా అన్ని పార్టీల నేత‌లు అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఈనెల 16వ తేదీన ద‌ర్శ‌నం చేసుకుని 17వ తేదీన తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో అమ‌రావ‌తి రైతులు పాల్గొంటారు.అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు పోటీగా రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం స‌మావేశాన్ని పెట్టాల‌ని నిర్ణ‌యించింది. కానీ, హైకోక్టు అనుమ‌తి నిరాకరించ‌డంతో మ‌రుస‌టి రోజు అంటే 18న బ‌హిరంగ స‌భ‌ను పెడుతోంది. మొత్తం మీద అమ‌రావ‌తి రైతుల‌కు పోటీగా రాయ‌ల‌సీమ ఫోరం స‌భ పెట్టనుంది. దీంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రంగు ఈ రెండు స‌భ‌ల‌కు అల‌ముకుంది.