Site icon HashtagU Telugu

Amaravati : సీఎం జగన్ అమరావతి పర్యటన..నిరసన తెలుపుతున్న రైతులు

Cm Jagan Amaravathi

Cm Jagan Amaravathi

సీఎం జగన్ అమరావతి పర్యటన (Jagan Amaravati Tour) ఉద్రిక్తతల నడుమ కొనసాగుతుంది. కృష్ణాయపాలెం (Krishnayapalem)లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తుంటే..మరోపక్క అమరావతి రైతులు (Amaravati Farmers) ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎలా శంకుస్థాపన చేస్తారంటూ వారంతా ఆందోళనలు చేస్తున్నారు.

ఆర్ 5 జోన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పటికీ… ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణంపై ముందుకెళ్తున్నారని రైతులు విమర్శలు చేస్తున్నారు. కోర్టులపై సీఎం జగన్ కు గౌరవం లేదని దుయ్యబట్టారు. రాజధాని రైతులను కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఇబ్బంది పెడుతున్నారని వారంతా వాపోతున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వారంతా నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

కృష్ణాయపాలెం(Krishnayapalem)లో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ సోమవారం భూమి పూజ చేసి లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంత‌రం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేదవారికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది.

Read Also : Viveka Murder Case: సిబిఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి లేఖ