Site icon HashtagU Telugu

Amaravati Drone Summit 2024 : 5 గిన్నిస్ రికార్డ్స్ తో చరిత్ర సృష్టించిన ‘డ్రోన్ షో’

Amaravati Drone Show Create

Amaravati Drone Show Create

విజయవాడలో నిర్వహించిన అతిపెద్ద డ్రోన్ షో (Amaravati Drone Summit 2024) చరిత్ర (Created History) సృష్టించింది. 5,500 డ్రోన్ల (5,500 Drones )తో ఆకాశంలో ప్రదర్శించిన పలు ఆకృతులు ఆకట్టుకున్నాయి. అమరావతి, జాతీయ పతాకం, గౌతమ బుద్ధుడు, విమానం, ప్రపంచ పటంలో భారత దేశం ఆకారంలో ప్రదర్శనలు కనువిందు చేశాయి. అంతకుముందు కృష్ణం వందే జగద్గురుం కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే షో ప్రారంభ కార్యక్రమంలో కళాకారులు చేసిన ప్రదర్శన అందర్నీ అలరించింది. ముఖ్యంగా ‘నాకముకా’ సాంగ్ కు యువతీ యువకులు చేసిన డాన్స్ సీఎం చంద్రబాబును తెగ ఆకట్టుకుంది. చివర్లో వారు సైకిల్ ను ఎత్తిపట్టుకుని దానిపై కూర్చోవడం చూసి ఆయన నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

ఈ భారీ షో ఏకంగా ఐదు గిన్నిస్ రికార్డులు (Guinness Book Records) సాధించాయి. డ్రోన్లతో లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, ల్యాండ్ మార్క్, ప్లేన్ ఫార్మేషన్, అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, మరియు ఏరియల్ లోగోలు వంటి ఆకృతులను ప్రదర్శించడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ అపూర్వ ఘనతకు గాను, గిన్నిస్ ప్రతినిధులు ధ్రువపత్రాలను సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అందించారు.

విజయవాడ కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద ఈ డ్రోన్ షో జరిగింది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన, లేజర్ షో నిర్వహించారు. 8 వేల మంది డ్రోన్ షో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డ్రోన్‌ షో వీక్షించేలా విజయవాడలో నాలుగు చోట్ల డిస్‌ప్లేలు సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Read Also : Ram Charan : ఖైరతాబాద్ RTO ఆఫీస్ లో గ్లోబెల్ స్టార్ ..సెల్ఫీ ల కోసం పోటీ