Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్‌పై ఎఫెక్టు పడుతుందా ?

ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.

  • Written By:
  • Updated On - June 15, 2024 / 12:42 PM IST

Amaravati Vs Hyderabad : ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయంటూ కొందరు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఐదేళ్లపాటు అమరావతి విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పాతాళంలోకి వెళ్లడంతో బిల్డర్లు, రియల్టర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. కానీ ఇప్పుడు జనసేన-బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇటీవల జరిగిన లోక్ సభ, ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రావడంతో మళ్లీ వాళ్లలో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని రైతులు. తమ ప్రాంతానికి పునరుజ్జీవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో హైదరాబాద్ కు పెట్టబడులు తరలి వెళ్తాయని ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్లు అనుకుంటున్నట్టు ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పకూలుతుందా.. లేదంటే హైదరాబాద్ పై(Amaravati Vs Hyderabad) ఆ ఎఫెక్ట్ ఉంటుందా అసలు అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

We’re now on WhatsApp. Click to Join

2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన తర్వాత నాడు ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోను, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలోనూ భూముల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రకటించడం మళ్లీ ఆ ప్రాంత రైతుల, ప్రజల కళ్లల్లో ఆశలు చిగురించేలా చేసింది. అంతే కాదు అమరావతిలో అభివృద్ధి గ్యారంటీ అంటూ కొందరు బల్లగుద్ది చెప్తున్నారు.

Also Read :KCR Letter : రాజకీయ కక్షతోనే నాపై విచారణ.. నరసింహారెడ్డి తప్పుకోవాలి.. కేసీఆర్ లేఖ

చంద్రబాబు పిలుపుతో అమరావతిలో రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని అమరావతిని ప్రపంచం గుర్తించేవిధంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన రాజధాని అమరావతిలో నిర్మాణాలు చేసిన వారికి, భూముల కొనుగోలు, అమ్మకాలు లావాదేవీలు చేసే వారికి ఓ గొప్ప బూస్ట్ ను ఇచ్చింది. దీంతో అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశాలున్నట్టు క్లియర్ కట్ గా అర్ధమవుతోంది. ఈ సమయంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రీసెర్చ్ లో కీలక విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అభివృద్ధి జరిగి మహానగరంగా రూపుదిద్దుకుంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు సవాల్ విసురుతుందని తేల్చింది.

అమరావతిలో అభివృద్ధి జరిగితే.. 

హైదరాబాద్ లోనూ భూముల ధరలు తక్కువేం లేవు. రోజురోజుకూ పెరుగుతున్నాయే కానీ.. తగ్గుతాయా అన్న ఆలోచన కూడా కనుసన్నల్లోనూ కనిపించట్లేదు. ఒకవేళ చెప్పినట్టుగానే అమరావతిలో అభివృద్ధి జరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే ఆ సమయంలో ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంటుందో అయితే చెప్పలేం.. కానీ ఇప్పటికిప్పుడు అమరావతిలో జరిగే రియల్ వ్యాపారం.. హైదరాబాద్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉండదని అంటున్నారు కొందరు నిపుణులు.

Also Read : Farmers Loan Waiver : రైతు రుణమాఫీపై త్వరలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం