Amaravati: `అమ‌రావ‌తి` సుప్రీం విచార‌ణ వాయిదా

అమ‌రావ‌తి రాజ‌ధానిపై విచార‌ణ ఈనెల 14వ తేదీకి వాయిదా ప‌డింది. ఏపీ స‌ర్కార్ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్లో ఇంప్లీడ్ అయిన అమ‌రావ‌తి రైతులు విచార‌ణ కోర‌గా వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - November 4, 2022 / 04:21 PM IST

అమ‌రావ‌తి రాజ‌ధానిపై విచార‌ణ ఈనెల 14వ తేదీకి వాయిదా ప‌డింది. ఏపీ స‌ర్కార్ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్లో ఇంప్లీడ్ అయిన అమ‌రావ‌తి రైతులు విచార‌ణ కోర‌గా వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వంగా ఈనెల ఒక‌టో తేదీన సుప్రీం కోర్టు విచార‌ణ జ‌ర‌పాలి. కానీ, చీఫ్ జ‌స్టిస్ ల‌లిత్ మ‌రో బెంచ్ కు మార్చాల‌ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. తాను లేని బెంచ్ కు బ‌దిలీ చేయాల‌ని సూచించారు. ఆ మేర‌కు రిజిస్ట్రీ నిర్ణ‌యం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పున స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రాజ‌ధాని మీద స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం విదిత‌మే.ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ మీద జ‌రిగే విచార‌ణలో త‌మనూ ఇంప్లీడ్ చేయాల‌ని అమ‌రావ‌తి జేఏసీ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కూడా సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. అంతేకాదు, ప‌లువురు వ్య‌క్తిగ‌తంగా వేసిన ఇంప్లీడ్ పిటిష‌న్ల‌ను కూడా ఈ విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. వీటిన్నిటిపైన శుక్ర‌వారం సుప్రీం కోర్టు ఒక డైరెక్ష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉందని ఆస‌క్తిగా చూశారు. కానీ, అమరావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారం ఈనెల 14వ తేదీకి వాయిదా ప‌డింది. జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌యోగించిన `నాగ్ బిఫోర్ మీ`అమ‌రావ‌తి రైతుల‌ను నిరాశ‌ప‌రిచింది. అయితే, సుప్రీం కోర్టు జ‌డ్జిలు కేఎం జోసెఫ్‌, రుషికేష్ రాయ్ తో కూడిన బెంచ్ కు అమ‌రావ‌తి ఇష్యూ చేరింది. ఆ మేర‌కు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ వాయిదా ప‌డింది.