అమరావతి (Amaravathi ) ప్రాంతంలో భూములున్న (Amaravathi Lands) వారు ఇక కోటీశ్వరులే..మొన్నటి వరకు తమ భూములను ఎలా అమ్ముకోవాలో..? ఎవరు కొంటారో..? అని నిరాశ వ్యక్తం చేసిన వారికీ ఇప్పుడు చంద్రబాబు తీపి కబురు అందించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు (CHandrababu)..అమరావతి ని రాజధానిగా ప్రకటించి అక్కడి రైతుల్లో ఆనందం నింపారు. అమరావతి రాజధానిగా ప్రకటించడం తో అక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. లక్షల్లో పలికిన ధరలు కోట్లకు చేరాయి. ఇది చూసి వారంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చి రాజధాని అమరావతి కాదంటూ ప్రకటించి అక్కడి రైతుల్లో నిరాశ నింపారు. ఐదేళ్ల పాటు అమరావతి లో ఎలాంటి కట్టడాలు చేయకుండా..ఆలా వదిలేసేసరికి..అక్కడి వారంతా ఆందోళన బాట పట్టారు. అయినప్పటికీ జగన్ ఎక్కడ తగ్గలేదు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యి..మళ్లీ అమరావతి కి ఊపిరి పోసాడు.
కూటమి సర్కార్ రావడం ..రావడమే అమరావతి ఫై ఫోకస్ చేసింది. స్మశానంలా మారిన అక్కడి వాతావరణాన్ని స్వర్గంలా మార్చారు. ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందజేసి అక్కడి వారిలో ఆనందం నింపారు. అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ..అమరావతి ఔటర్ ప్రాజెక్టు (Amaravati Outer Project) కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసాడు. కేంద్రం ఎప్పుడో అనుమతినిచ్చిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు నిధుల కేటాయింపులు జరిగాయి. భూసేకరణతో సహా మొత్తం ఖర్చును భరించటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందనుంది. ఫలితంగా భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా 189కి.మీటర్లతో ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం కాబోతుంది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 25వేల కోట్లుగా లెక్కగట్టారు. భూసేకరణతో సహా మొత్తం ఖర్చును కేంద్రప్రభుత్వమే భరించబోతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్‌మెంట్, డీపీఆర్, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు భాగం 78 కి.మీ వరకు ఉంటుంది. పశ్చిమ భాగం 111 కి.మీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 189 కి.మీ ఉండనుంది. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ఆర్‌వోడబ్ల్యూ, మూడు సొరంగాలు, తొమ్మిది ఇంటర్‌ఛేంజీలు, కృష్ణా నదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకు లింక్ కానుంది.
అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఓఆర్‌ఆర్‌తో లోపలి భూములే కాక ఓఆర్‌ఆర్ బయట ఉన్న భూములకు మంచి డిమాండ్ రానుంది. ఈ ప్రాంత భూములు బంగారం అవ్వడం ఖాయం. ఓఆర్‌ఆర్ పనులు ప్రారంభం కావడం తో అక్కడి ప్రజలంతా సంబరాలు చేసుకుంటూ..ఇక మనం పేదవాళ్లం కాదు కోటీశ్వరుల మంటూ చెప్పుకుంటున్నారు.
Read Also : Savitri Jindal : లీడ్‌లో అత్యంత ధనిక మహిళ సావిత్రీ జిందాల్.. మెహబూబా ముఫ్తీ కుమార్తె వెనుకంజ