Amaravathi: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

  • Written By:
  • Publish Date - December 14, 2021 / 05:49 PM IST

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రేపటినుండి రైతుబంధు నిధులను పంపిణి చేస్తున్నట్టు ప్రకటించింది. యధావిధిగా ఎకరాకు 5000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జామకానున్నాయి. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో డబ్బు జమ అయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ పథకం కోసం దాదాపు 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిసెంబరు 15 నుండి ఈ నెల చివరి వరకు రైతుల ఖాతాల్లోకి ఈ నగదు జమకానుంది. గత వానాకాలంలో తొలి రోజు ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్నవారికి ఆ తర్వాత మూడు ఎకరాలపైన భూమి ఉన్న రైతులకు డబ్బులు పంపిణి చేశారు. ఈ సీజన్ లో కూడా అదే పద్దతిని కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు.