Amar Raja : ఔను! ఏపీ వేధిస్తే తెలంగాణ‌ ప్రేమించింది.!

ఏపీ అనాధ‌గా మిగిలిపోతుందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఎందుకంటే, అమ‌ర్ రాజా(Amar Raja) కంపెనీ అంటే ఒక డిగ్నిటీ.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:52 PM IST

ఏపీ అనాధ‌గా మిగిలిపోతుందా? అయిన వాళ్లు కూడా మొఖం చాటేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఎందుకంటే, చిత్తూరు జిల్లాకు చెందిన `గ‌ల్లా` కుటుంబంకు చెందిన అమ‌ర్ రాజా(Amar Raja) కంపెనీ అంటే ఒక డిగ్నిటీ. ఆ కంపెనీ పూర్తి స్థాయిలో నిబంధ‌న‌లు పాటిస్తూ న‌డుస్తుంద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవార్డుల‌ను, రివార్డుల‌ను ఇచ్చిన సంద‌ర్భాలు అనేకం. అలాంటి కంపెనీ ఇప్పుడు తెలంగాణకు(Telangana) వ‌చ్చింది. అమ‌ర్ రాజా 2.0 మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో పురుడుపోసుకుంది.

`గ‌ల్లా` కుటుంబంకు చెందిన అమ‌ర్ రాజా(Amar Raja)

బ్యాట‌రీల త‌యారీలో అగ్ర‌గామి కంపెనీ అమ‌రరాజా(Amar Raja) . ఆ కంపెనీ కొన్ని వేల మందికి ఏపీలో ఉపాథి ఇస్తోంది. పైగా లోక‌ల్ టాలెంట్ ను ప్రోత్స‌హిస్తోంది. అలాంటి కంపెనీ మీద పొల్యూష‌న్ కంట్రోల్ సంస్థ ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Redddy) స‌ర్కార్ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆ కంపెనీ యాజ‌మాన్యాన్ని నానా ఇబ్బందులు పెట్టింది. భూముల‌ను లాగేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. సీన్ క‌ట్ చేస్తే, దాని విస్త‌ర‌ణ త‌మిళ‌నాడుకు(Tamilanadu) వెళుతుంద‌ని భావించారు. కానీ, ఆ కంపెనీ విలువ తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ‌కు తీసుకొచ్చారు.

అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ గా. గిగా ఫ్యాక్టరీ

అమ‌ర‌రాజా(Amar Raja) గిగా ఫ్యాక్ట‌రీ ఒక అద్బుతం. సుమారు 10వేల కోట్ల పెట్టుబడుల‌తో అత్యాధునిక ప‌రిజ్ఞానంతో ఈ కంపెనీ విస్త‌ర‌ణ‌ను తెలంగాణ లో చేప‌ట్టారు. దానికి శ‌నివారం భూమి పూజ జ‌రిగింది. అంగ‌రంగం వైభ‌వంగా జ‌రిగిన కంపెనీ భూమి పూజ త‌రువాత మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈవీ, సస్టెయినబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక పెద్ద అడుగు అని కేటీఆర్ ప్రశంసించారు. భారత్ లో ఈ రంగంలో ఇదొక భారీ పెట్టుబడి అని అన్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ గా వెల్ల‌డించారు. గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణను(Telangana) ఎంపిక చేసుకున్నందుకు తన మిత్రుడు గల్లా జయదేవ్(Gall Jaydev) కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

పారిశ్రామికీక‌ర‌ణ కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు ప్ర‌య‌త్నాల‌ను ..

పారిశ్రామికీక‌ర‌ణ కోసం ప‌లు ప్ర‌య‌త్నాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ చేస్తోంది. అందుకోసం ఇటీవ‌ల జీ20 స‌ద‌స్సును విశాఖ కేంద్రంగా నిర్వ‌హించింది. ఆదానీ, రిల‌యెన్స్ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేడుకున్నారు. ఇప్ప‌టి రెండుసార్లు దావోస్ వెళ్లారు. కానీ, ఎక్క‌డా పెట్టుబ‌డులు వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. కానీ, స్థానికంగా ఉండే కంపెనీల‌ను మాత్రం ఆయ‌న స‌ర్కార్ నిర్ల‌క్ష్యం చేస్తోంది. ప్రోత్స‌హ‌కాల‌ను ఇవ్వ‌క‌పోగా, ఆ కంపెనీల యాజ‌మాన్యంతో స‌ఖ్య‌త కొర‌వ‌డింది. అనంత‌పురం జిల్లాలో ఉత్ప‌త్తిని ప్రారంభించిన కియా కంపెనీ కూడా నానా తంటాలు ప‌డుతోంది. స్థానిక వైసీపీ లీడ‌ర్ల‌తో నిత్యం ఏదో ఒక ఇష్యూ ఉంటుంద‌ని యాజ‌మాన్యం భావిస్తోంది. అందుకే, రెండో విడ‌త విస్త‌ర‌ణ‌కు వెళ్ల‌కుండా ఆగిపోయింది.

Also Read : Amara Raja: తెలంగాణలో అమర రాజా మరో అడుగు! టీడీపీ ఎంపీ ‘గల్లా’ విస్తరణ

ఇక గ‌ల్లా జ‌య‌దేవ్(Gall Jaydev) గుంటూరు ఎంపీ కంటే పారిశ్రామిక‌వేత్త‌గా అంద‌రికీ తెలుసు. ఆయ‌న తండ్రి నుంచి వచ్చిన పారిశ్రామిక వార‌సత్వాన్ని ప‌విత్రంగా కొన‌సాగిస్తున్నారు. అలాంటి ఆయ‌న నిర్వ‌హ‌ణ‌లోని అమ‌ర‌రాజా(Amar Raja) కంపెనీ విస్త‌ర‌ణ లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అడ్డుకుంది. ఆ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ ప‌లుమార్లు చెప్పింది. ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉండే పారిశ్రామిక వేత్త‌లు ఎవ‌రూ ఏపీ వైపు చూడ‌డంలేదు. అంద‌రూ, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు విస్త‌రంగా పెడుతున్నారు. అందుకే, ఏపీ ఫినిష్ అంటూ ఇటీవ‌ల మంత్రి మ‌ల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కేసీఆర్, బ‌య‌ట మంత్రులు హ‌రీశ్ రావు, కేటీఆర్ లు ప‌లుమార్లు ఏపీ వెనుక‌బాటును వ్యంగ్యంగా మాట్లాడారు. పార్టీల‌కు అతీతంగా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆహ్వానిస్తూ కేసీఆర్ స‌ర్కార్ పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హిస్తోంది.

Also Read : Amara Raja: తెలంగాణలో ఈవీ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు – అమర రాజా గ్రూప్

ఏపీలో మాత్రం పార్టీల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను పెట్టించే ప్ర‌య‌త్నం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) స‌ర్కార్ చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు బోలెడు. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాన్ని న‌మ్ముకుని ఎవ‌రూ ఆ పార్టీ సానుభూతిప‌రులుగా ఉండే పారిశ్రామిక‌వేత్త‌లు పెట్టుబడులు పెట్ట‌డానికి ముందుకు రావ‌డంలేదు. పోనీ, టీడీపీకి సానుభూతిప‌రులుగా ఉండే పారిశ్రామిక‌వేత్త‌లు వ‌స్తారా? అంటే వాళ్లు రావ‌డంలేదు. కార‌ణం, ప్ర‌స్తుతం ఉన్న పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వేధిస్తున్నార‌ని ప్ర‌చారం ఉంది. ఫ‌లితంగా ఏపీ రెంటికీ చెడ్డ రేవ‌డి మాదిరిగా ఎవ‌రికీ కాకుండా ఏపీ అనాధ‌గా మారుతుంద‌న్న ఆందోళ‌న స‌గ‌టు ఏపీ పౌరుడిలో ఉందన‌డంలో సందేహం లేదు.