Andhra Pradesh : ఏపీలో కొబ్బరిబోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన అమ‌లాపురం ఎంపీ

కోన‌సీమ‌లో కొబ్బరిబోర్డు ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అమ‌లాపురం ఎంపీ చింతా అనురాధ తెలిపారు. కొబ్బరి

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 02:15 PM IST

కోన‌సీమ‌లో కొబ్బరిబోర్డు ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అమ‌లాపురం ఎంపీ చింతా అనురాధ తెలిపారు. కొబ్బరి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ ప్రాంతంలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. అమలాపురంలో జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి, నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కొబ్బరి ధరలు పెంచాలని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డ్రెయిన్లు) కార్యాలయాన్ని అమలాపురం మార్చాలని స‌మావేశంలో ఆమె ప్రస్తావించారు.

జిల్లా యూనిట్‌గా తీసుకుని దెబ్బతిన్న ఉద్యాన పంటలకు పరిహారం చెల్లిస్తామని ఎంపీ అనురాధ‌ తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీని కూడా పెంచనున్నారు. కాలువలు, డ్రెయిన్లలోని కలుపు మొక్కలను తొలగించి సాగునీటిని కలుషితం కాకుండా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు ఆక్వా రైతులకు రాయితీలు ఇస్తామని, అలాగే చేపల పెంపకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆక్వా రైతులపై చర్యలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.