Site icon HashtagU Telugu

YCP- TDP: వైసీపీలోకి ఆలూరు కీలక నేతలు.. టీడీపీకి షాక్‌..!

YCP- TDP

Tdp Ycp Vimarshalu

YCP- TDP: ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు హ‌డావుడి మొద‌లైంది. అటు అధికార పార్టీ.. ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ, జ‌న‌సేనలు (YCP- TDP)సైతం ఈ ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్నాయి. అయితే సీటు ఆశించి సీటు రాని ప్ర‌ధాన నేత‌లు ఎన్నిక‌ల ముందు పార్టీలు మారుతూ షాక్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి షాక్ ఇస్తూ వైసీపీలో చేరారు వైకుంఠం శ్రీరాములు కొడుకు వైకుంఠం మ‌ల్లికార్జున.

ఆలూరు నియోజకవర్గంలో కీలక నేతగా తెలుగుదేశం పార్టీలో పేరుగాంచిన వైకుంఠం శ్రీరాములు తనయుడు వైకుంఠ మల్లికార్జున తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్సీపి పార్టీలో చేరారు. వైకుంఠం మల్లికార్జున చౌదరికి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కోసం వైకుంఠం మల్లికార్జున తన తల్లిదండ్రులను సైతం పోగొట్టుకోవాల్సి వచ్చింది.

Also Read: Kavitha : కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్‌

ఇంత జరిగినా ఇదంతా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం గత పాతిక (25) సంవత్సరాలకు పైబడి పార్టీని నమ్ముకొని నేడు రేపు పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమను గుర్తిస్తారని, ఇప్పటిదాకా అదే పార్టీలో ఎన్నో ఒడిదుడుకులకు లోనైనా, వాటన్నింటినీ పక్కనపెట్టి పనిచేస్తున్న వైకుంఠం మల్లికార్జున చౌదరిని పార్టీ అధిష్టానం ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఎదురు చూశారు. అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని నిరాకరించి.. చివరకు పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో వైకుంఠం మల్లికార్జున చౌదరి కాస్త ఈ విషయంపై కొన్ని రోజులుగా లోలోపల మదనపడ్డారు.

We’re now on WhatsApp : Click to Join

తెలుగుదేశం పార్టీ ఆది నాయకులు వైకుంఠ మల్లికార్జున చౌదరిని సమ్మతిని కూడా అడగకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయన విశ్వసనీయంగా ఆలోచన చేసి మరీ తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైకుంఠ మల్లికార్జున చౌదరితో పాటు ఎమ్మెల్సీ మసాలా పద్మజ మొలగవల్లి గ్రామానికి చెందిన బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ, ఆయన వర్గం భారీగా వైసీపీలో చేరారు.

Exit mobile version