Allu Vs Mega Family: ‌అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ..టాలీవుడ్‌లో కలకలం

ఈ రెండు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం (War) నడుస్తుందనేది మరోసారి స్పష్టమైంది.  మెగా-అల్లు బాండింగ్  (Bonding) ముక్కలవడానికి కారణం అల్లు అర్జునే (Allu Arjun) అనేలా టాక్ ఎప్పటి నుండో వినబడుతోంది.

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 05:05 PM IST

Allu Vs Mega Family: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవం (Swearing Ceremony) గ్రాండ్‌గా జరగ‌్గా.. ఈ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ (Mega Family), అల్లు ఫ్యామిలీల (Allu Family) మధ్య యుద్ధం జరుగుతుందనే విషయం రివీలైందనేలా వార్తలు… వైరల్ (Viral) అవుతున్నాయి. ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా ఈ వేడుకలో కనిపించలేదు.

 

దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వార్ (Family War) నడుస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్‌గా ఢిల్లీ (Delhi) పర్యటన ముగించుకుని అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. తన ఫ్యామిలీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతూనే ఉన్నాయి. ఐతే, మెగా ఫ్యామిలీలో(Mega Family) ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు ఫ్యామిలీ (Allu Family).. ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాగే చంద్రబాబుతో (Chandrababu) పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ.. అల్లు ఫ్యామిలీ రాలేదు.

 

దీంతో.. ఈ రెండు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం (War) నడుస్తుందనేది మరోసారి స్పష్టమైంది.  మెగా-అల్లు బాండింగ్  (Bonding) ముక్కలవడానికి కారణం అల్లు అర్జునే (Allu Arjun) అనేలా టాక్ ఎప్పటి నుండో వినబడుతోంది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ఒక సైన్యం క్రియేట్ చేసుకునే క్రమంలో ‘అల్లు ఆర్మీ’ని (Allu Army) లైన్‌లోకి తెచ్చాడు. అప్పటి నుంచి మెగా-అల్లు కుటుంబాల, ఫ్యాన్స్ (Fans) మధ్య ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప (Pushpa) విజయంతో (Victory) అల్లు ఆర్మీని, అల్లు అర్జున్‌ని ఆపడం మెగా ఫ్యాన్స్ వల్ల కూడా కాలేదు. అదే సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా (Best Actor) నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్.. ఇక తగ్గేదేలే అన్నట్లుగా తన తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు.

 

ఇది మెగా ఫ్యామిలీకి (Mega Family), మెగా ఫ్యాన్స్‌ కు కూడా నచ్చలేదు. నాకు కావాల్సింది కూడా ఇదే అన్నట్లుగా అల్లు అర్జున్ (Allu Arjun) చెలరేగిపోతుండటంతో పాటు.. రీసెంట్‌గా ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో మెగా ఫ్యామిలీ (Mega Family) సపోర్ట్ చేసిన కూటమి ని కాదని, వైసీపీకి చెందిన తన స్నేహితుడి ప్రచార నిమిత్తం చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా.. కావాలనే అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చేశారు. అవును.. అల్లు అర్జున్ రేంజ్ పొలిటికల్‌గా (Political) జీరో అనే చెప్పాలి. ఎందుకంటే, మొన్నటి ఏపీ ఎన్నికలలో ఆయన మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డి (Ravi KishoreChandra Reddy) ఓడిపోయాడు.

 

ఈ లెక్కన అల్లు అర్జున్ పవర్ పొలిటికల్‌గా (Political) ఏ మాత్రం పనిచేయలేదనేది స్పష్టమైంది. రామ్ చరణ్ (Ram Charan) రేంజ్ కూడా అల్లు అర్జున్ సెపరేషన్‌కు కారణం అనేలా… కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. రామ్ చరణ్ కంటే ముందే హీరోగా లాంచ్ అయినా.. బన్నీకి సరైన బ్లాక్ బస్టర్ (Block Buster) పడటానికి చాలా సమయం పట్టింది. కానీ రామ్ చరణ్‌ రెండో సినిమానే అందులోనూ గీతా ఆర్ట్స్‌లో (Geetha Arts) చేసిన సినిమానే ఇండస్ట్రీ హిట్‌గా (Industry Hit) నిలవడంతో ఒక్కసారిగా చరణ్ (Ram Charan) రేంజ్ మారిపోయింది.

 

ఏదయితేనేం.. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనే దానికి ఈ మధ్య పలు సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది అనేలా.. విమర్శకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.