పుష్ప 2 (Pushpa 2)తో మరోసారి తన సత్తా చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ..ఇప్పుడు రాజకీయాల (Politics ) వైపు దృష్టి పెడుతున్నారా..? పొలిటికల్ ఎంట్రీ (Political Entry) ఇచ్చి రాజకీయాల్లో కూడా తగ్గేదేలే అనిపించుకోవాలని భావిస్తున్నాడా..? అందుకే రాజకీయ విశ్లేషకుడు కిషోర్ ను కలిశాడా..? ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అల్లు అర్జున్ టీమ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ను కలిసినట్టు సమాచారం. అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి కిషోర్ (PK ) ను సలహాలు అడిగారట..అయితే ఇప్పుడే రాజకీయ ఎంట్రీ అవసరం లేదని కిషోర్ చెప్పినట్లు తెలుస్తుంది.
కనీసం పదేళ్లు సోషల్ సర్వీస్ లో కొనసాగి ఆ తర్వాతే రాజకీయ ప్రకటన చేయాలని సూచించినట్టు సమాచారం. పీకేతో భేటీలో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్టు వినికిడి. ప్రశాంత్ కిశోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్ లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రావాలని , ప్రజలు కొంతకాలం సేవ చేసి ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ చేయాలనీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తలను అల్లు అర్జున్ టీం ఖండించింది. అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కావాలనే కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారని…అభిమానులెవరు కూడా ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు.