Site icon HashtagU Telugu

YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

YS Jagan

YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ (YS Jagan).. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్.. బాలకృష్ణ ‘తాగి’ అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వహించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటుగా బదులిచ్చారు. “అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు” అని జగన్ తీవ్రంగా విమర్శించారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను మరింత తీవ్రతరం చేస్తూ.. “తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదు” అంటూ స్పీకర్‌పైనా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని జగన్ వ్యాఖ్యానించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేపై మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతిపై కొత్త చర్చకు తెర తీసింది.

Also Read: Virat Kohli: వ‌న్డే ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్ప‌నున్నాడా?

అసెంబ్లీలో అసలు వివాదం

గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారనే అంశాన్ని చర్చకు లేవనెత్తారు. దీనిని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్, చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుత దుమారానికి కారణమయ్యాయి.

అయితే ఈ వివాదంపై నటుడు చిరంజీవి అప్పట్లోనే స్పందించారు. గత ప్రభుత్వంలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని, నాటి ముఖ్యమంత్రి జగన్ తనను గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని జగన్ వర్గం ఇప్పుడు గుర్తుచేస్తోంది. ప్రస్తుతం జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు ఎలా స్పందిస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

Exit mobile version